Breaking News

దేశ రాజ‌ధానిలో హీట్‌వేవ్‌.. ఢిల్లీ, నోయిడాలో 15 మంది మృత్యువాత‌

Published on Wed, 06/19/2024 - 17:01

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి. సూర్యుడు భ‌గ‌భ‌గ మండిపోతున్నాడు. అసాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. తీవ్ర‌మైన ఎండ‌, ఉక్క‌పోత‌తో ప్ర‌జ‌లు అల్ల‌డిపోతున్నారు.  ఓవైపు భానుడి ప్రతాపం.. మరోవైపు నీటి సంక్షోభం ఢిల్లీ ప్రజలను పీడిస్తున్నాయి.

ఎండ వేడిమి, వడగాలుల ధాటికి  జనం  పిట్టల్లా రాలుతున్నారు.  ఢిల్లీ ఎన్సీఆర్ ప‌రిధిలో  గడచిన 72 గంటల్లో వడ దెబ్బతో 15 మంది మృతి చెందారు. ఢిల్లీలో 5, నోయిడాలో 10 మంది మ‌ర‌ణించారు. ఢిల్లీలోని రామ్ మ‌నోహ‌ర్ లోహియా హ‌స్పిట‌ల్‌లో 12 మంది వెంటిలేటర్ సపోర్ట‌తో చికిత్స పొందుతున్నారు.  మ‌రో 36 మంది వడదెబ్బతో చికిత్స పొందుతున్నారు.

హీట్‌స్ట్రోక్ కేసుల్లో మరణాల రేటు దాదాపు 60-70 శాతం ఎక్కువāగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ శుక్లా తెలిపారు. రోగులలో చాలా మంది వలస కూలీలే ఉన్న‌ట్లు తెలిపారు. అధికంగా 60 ఏళ్లు పైబ‌డిన వారే ఉన్న‌ట్లు పేర్కొన్నారు. హీట్‌స్ట్రోక్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు

కాగా ఢిల్లీ వాసులు దాదాపు నెల రోజులుగా తీవ్ర ఎండ‌, వేడిగాలులతో అల్లాడిపోతున్నారు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల మార్కును దాటాయి. హీట్​వేవ్స్ కారణంగా నార్త్ ఇండియా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వారం రోజులుగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానాతో పాటు పంజాబ్​లో వేడి గాలుల తీవ్రత పెరిగింది. ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్​లోనూ ఎండలు దంచికొడ్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో సగటున 45 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు వుతున్నట్టు ఐఎండీ అధికారులు తెలిపారు. మ‌రోవైపు ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో రాబోయే 24 గంటలపాటు వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ  పేర్కొంది.

Videos

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)