Breaking News

Uttarakhand: మంచు చరియల కిందే ఇంకా 8 మంది

Published on Sat, 03/01/2025 - 11:46

ఉత్తరాఖండ్‌: పర్వత రాష్ట్రం ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో భారీగా కురుస్తున్న హిమపాతం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. బద్రీనాథ్‌లోని మానా గ్రామం సమీపంలో సరిహద్దు రోడ్డు సంస్థ (బీఆర్‌ఓ) శిబిరంపై  మంచు చరియలు విరిగిపడటంతో 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం సంభవించింది. ఈ దరిమిలా భారత సైన్యం, రెస్క్యూ ఆపరేషన్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. రెస్క్యూ సిబ్బంది మంచు పెళ్లల నుంచి 47 మందిని సురక్షితంగా వెలికి తీసుకువచ్చారు. మరో ఎనిమిదిమందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

రెండవ రోజున సహాయక చర్యలు తిరిగి ప్రారంభించిన భారత సైన్యం(Indian Army) మంచులో కూరుకుపోయిన మరో 14 మంది సిబ్బందిని రక్షించింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వైద్య చికిత్స అందించేందుకు హెలికాప్టర్ల ద్వారా జోషిమఠ్‌కు తరలించామని  అధికారులు తెలిపారు. ఇంకా మంచులోనే కూరుకుపోయిన సిబ్బందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నిన్న(శుక్రవారం) రాత్రి చీకటి పడ్డాక సహాయక చర్యలను నిలిపివేశారు.

హిమపాత మరింతగా పెరగడంతో  మంచులో కూరుకుపోయిన కార్మికులను కనుగొనడం రెస్క్యూ సిబ్బంది(Rescue crew)కి సవాలుగా మారింది. మొదటి రోజున రెస్క్యూ బృందాలు 33 మంది కార్మికులను రక్షించగలిగాయి. ఈ ప్రాంతంలో ఏడు అడుగుల మేరకు మంచు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. ఇండో-టిబెట్ సరిహద్దులోని చివరి గ్రామమైన మానా వద్ద మంచును తొలగించే పనిలో నిమగ్నమైన 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు.

సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ 
ఉత్తరాఖండ్ మంచు చరియల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి పుష్కర్ ధామి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తాజాగా ఘటనా స్థలంలో కొనసాగుతున్న పనుల గురించి తెలుసుకునేందుకు సీఎం దామికి ప్రధాని మోదీ ఫోన్‌ చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)