Breaking News

4,000 ఈవీఎంలు అగ్నికి ఆహుతి 

Published on Sat, 06/13/2026 - 05:25

కోల్‌కతా: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4,000 ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎంలు) మంటల్లో కాలి బూడిదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రాష్ట్రంలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను నగరంలోని అలీపూర్‌ ప్రాంతంలో ఓ ప్రభుత్వ భవనంలో భద్రపర్చారు. ఇది బహుళ అంతస్తుల భవనం. ఇందులో ఎన్నికల సంబంధిత విభాగాలతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. శుక్రవారం ఉన్నట్టుండి భవనంలో మంటలు చెలరేగాయి. భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 

ఇటీవల ఎన్నికల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపయోగించిన 4,000 ఈవీఎంలు అగ్నికి ఆహుతైనట్లు అధికారులు వెల్లడించారు. అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక కుట్ర ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. భవనంలో హఠాత్తుగా మంటలు చెలరేగడానికి కారణం ఏమిటన్నది ఇంకా గుర్తించలేదు. ఇది సాధారణ అగ్ని ప్రమాదంలా కనిపించడం లేదని బెంగాల్‌ ఫైర్‌ సర్వీసుల శాఖ మంత్రి కౌశిక్‌ చౌదరి చెప్పారు. మొదట కింది అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా 8, 9 అంతస్తులకు వ్యాపించాయి. ఈ రెండు అంతస్తుల్లోనే ఎన్నికల విభాగాలు ఉన్నాయి. 

ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. నిజాలు నిగ్గుతేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, నష్టం తీవ్రతను అంచనా వేసే బాధ్యతను సిట్‌కు అప్పగించారు. అగ్ని ప్రమాదంలో ఈవీఎంలు పూర్తిగా కాలిపోవడం వెనుక అధికార బీజేపీ హస్తం ఉన్నట్లు ప్రతిపక్ష తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. ‘‘అగ్నిప్రమాదంలో అంతుచిక్కని రీతిలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. 4,000 కంట్రోల్‌ యూనిట్లు, 4,000 బ్యాలెట్‌ యూనిట్లు 4,000 వీవీప్యాట్‌లు బూడిదగా మారిపోయాయి’’అని పేర్కొంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)