సొంత ఇల్లు, కారు లేకపోయినా జీవితాన్ని ఇలా హాయిగా గడపొచ్చు..

Published on Mon, 07/20/2026 - 15:09

సొంత ఇల్లు, కారు కొనడం, సంపద కూడబెట్టడం.. విజయానికి గుర్తులుగా భావించే ప్రపంచంలో ఓ 35 ఏళ్ల వ్యక్తి తన జీవితం గురించి నిజాయితీగా షేర్‌ చేసుకున్న విషయాలు ఆన్‌లైన్‌లో ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. తన దగ్గర లేని వాటిపై దృష్టి పెట్టకుండా, గత ఏడాదితో పోల్చితే తన జీవితంలో వచ్చిన మెరుగుదల గురించి చెప్పాడు. అతని ఆలోచనా విధానం ఎంతో కొత్తగా అనిపించిందని చాలామంది అభిప్రాయపడ్డారు.

ఈ పోస్టును ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ ఆశిష్ జైన్ చేశారు. క్యాప్షన్‌లో ఆయన ఇలా రాశారు. "నేను 35 ఏళ్ల వ్యక్తిని. నా సొంత ఇల్లు లేదు. కారు లేదు. అంతగా బ్యాంకు బ్యాలెన్స్‌ లేదు. షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో పెద్ద పెట్టుబడులు లేవు. గొప్ప ఉద్యోగం కూడా లేదు. కానీ మంచి అద్దె ఇంట్లో ఉంటున్నా. ఉబెర్‌లో ప్రయాణించే స్తోమత ఉంది. ఒక్క రూపాయి అప్పు లేదు. గత ఏడాదితో పోల్చితే నా శరీరం మరింత ఆరోగ్యంగా ఉంది. మానసికంగానూ గత ఏడాదికంటే మెరుగ్గా ఉన్నా.

ఏడాది తర్వాత ప్రాధాన్యం లేని విషయాల గురించి ఇక ఒత్తిడి పడటం మానేశా. ఇల్లు, కారు కొనాలనే ఒత్తిడిని నాపై పెట్టుకోవడం లేదు. భవిష్యత్తు గురించి తక్కువగా ఆలోచిస్తున్నాను. శారీరక, మానసిక ఆరోగ్యంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాను. పొగతాగడం మానేశాను, జంక్ ఫుడ్ తినడం కూడా తగ్గించాను. పర్లేదు.. జీవితంలో ప్రతి విషయానికీ వెంటనే సమాధానం దొరకాల్సిన అవసరం లేదు. పర్లేదు.. వచ్చిన ప్రతి రోజును అలాగే జీవించండి. మీపైనే దృష్టి పెట్టండి" అని ఆశిష్‌ జైన్‌ పేర్కొన్నాడు.

నెటిజన్ల స్పందన
"అప్పు లేదు. రేపటి గురించి ఒత్తిడి లేదు. ధూమపానం మానేశారు. ఇతరులతో పోల్చుకోవడం కూడా ఆపేశారు. నాకు తెలిసిన చాలా మంది 35 ఏళ్ల వారి కంటే ఇది ఎంతో బలమైన జీవన పరిస్థితి. అభినందనలు ఆశిష్" అని ఒకరు కామెంట్‌ చేశారు.

మరో వ్యక్తి స్పందిస్తూ.. "ఆశిష్, నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. కృతజ్ఞతతో జీవించడం, ఇతరుల జీవనశైలితో పోల్చుకోకుండా, మీతో మీరే పోటీ పడటం.. ఇదే అత్యంత ఆచరణీయ జీవన విధానం" అని పేర్కొన్నారు.

"35 ఏళ్ల వయసులో అప్పులు లేకపోవడం, ఆరోగ్యమైన శరీరం, ప్రశాంతమైన మనసు.. ఇదే నిజమైన విజయం. ఈ విషయాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మన చేతిలో ఉన్న వాటిపైనే ప్రతి రోజు దృష్టి పెట్టడం.. పూర్తి చేయాల్సిన జాబితా వెంట పరుగెత్తడం కంటే ఎంతో గొప్పది. ఇలాగే ముందుకు సాగండి" అని మరొకరు కామెంట్‌ చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)