Breaking News

కారు దొంగతనం.. డ్రైవింగ్ రాక 10 కి.మీ తోసుకెళ్లి... చివరికి!

Published on Thu, 05/25/2023 - 12:24

ఉత్తర ప్రదేశ్‌లో వింత దొంగతనం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు కలిసి అడ్డదారిలో డబ్బు సంపాదించేదుకు ఓ కారును దొంగతనం చేయాలనుకున్నారు. అనుకున్నట్లే కారును దొంగిలించారు కానీ తరువాతే అసలు విషయం తెలిసింది. ముగ్గురిలో ఎవరికి కూడ డ్రైవింగ్‌ రాదని.. దీంతో చేసేదేం లేక కారును దాదాపు 10 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్లారు. అమినా చివరకు పోలీసులకు పట్టుబట్టారు. 

అసలేం జరిగిందంటే.. కాన్పూర్‌లోని దబౌలి ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అమన్‌ గౌతమ్‌, సత్యం కుమార్‌ కాలేజీ విద్యార్థులు.  వీరికి అమిత్‌ వర్మతో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి మే 7న కారు మారుతి వ్యాన్‌ను దొంగిలించాలని ప్లాన్‌ చేశారు.  పథకం ప్రకారమే కారును దొంగిలించారు. అయితే అక్కడే ఈ ముగ్గురికి కష్టాలు మొదలయ్యాయి. ముగ్గురిలో ఎవరికి కారు డ్రైవింగ్‌ రాదని అర్థమైంది. అయినా కారును వదిలి వెళ్లాలని అనిపించలేదు. దీంతో కారును నెట్టుకుంటూ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా రాత్రి 10 కిలోమీటర్లు దబౌలి నుంచి కళ్యాణ్‌పూర్‌ వరకు వ్యాన్‌ను తోసుకుంటూ వెళ్లారు.

10 కిలోమీటర్ల పాటు కారు తోయడంతో ఇక తమ వల్ల కాదని, నెంబర్ ప్లేట్ తొలగించి, ఓ నిర్మానుష్య ప్రాంతంలో దాచిపెట్టి అక్కడి నుంచి పారిపోయారు. తరువాత వచ్చి ఆ కారును అమ్మేయాలని కుట్ర పన్నారు. చివరికి ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో  ముగ్గురు దొంగల్ని అరెస్ట్ చేశారు.  ఈ దోపిడీకి అమిత్ స్కెచ్ వేయగా.. దీన్ని వెబ్ సైట్ ద్వారా అమ్మేందుకు సత్యం ప్లాన్ చేశాడని ఏసీపీ భేజ్ నారాయణ్ సింగ్ వెల్లడించారు.  ఒకవేళ కారు కొనడానికి ఎవరూ దొరక్కపోతే.. వెబ్ సైట్ ద్వారా విక్రయించాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు.
చదవండి: స్మార్ట్‌ టన్నెల్‌.. సెల్‌ సిగ్నల్‌ దొరక్క ప్రాణం పోయింది!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)