Breaking News

బరువు 150 గ్రాములు దూరం 5,000 కిలోమీటర్లు

Published on Thu, 11/20/2025 - 04:56

న్యూఢిల్లీ: నెలల తరబడి కఠోర శ్రమ తర్వాత పరుగుపందెంలో 100 మీటర్లు వేగంగా పరిగెడితే శెభాష్‌ అంటాం. మరి ప్రకృతి ఒడిలో సహజంగా అబ్బిన నైపుణ్యంతో మూడు గద్దలు ఏకంగా 5,000 కిలోమీటర్లు ఏకధాటిగా ఎగిరి వెళ్తే ఏమనాలి? కేవలం 150 గ్రాముల బరువైన ఈ చిన్న డేగల అసమాన ప్రయాణ కథ విని అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతున్నారు. 

భారత వన్యప్రాణి సంస్థ(డబ్ల్యూఐఐ) డేగల వలస వైరుధ్యాలను లెక్కగట్టేందుకు నవంబర్‌ 11న అపపాంగ్, అలాంగ్, అహూ అనే మూడు డేగలకు శాటిలైట్‌ ట్రాకర్‌లను అతికించి పరీక్షించింది. అవి మణిపూర్‌ అరణ్యాల్లో తమ ప్రయాణాన్ని ఆరంభించాయి. ఎక్కడా ఆగకుండా అలసిపోకుండా సుదూరాలకు పయనించాయి. బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక దాటుకుంటూ అరేబియా సముద్ర గగనతలాన్ని అలవోకగా దాటుకుంటూ తూర్పు ఆఫ్రికా దేశమైన సోమాలియాకు చేరుకున్నాయి. 5,000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఐదురోజుల్లో దాటేయడం విశేషం. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)