Breaking News

భోపాల్‌: షెల్టర్‌ హోం నుంచి 26 మంది బాలికల మిస్సింగ్‌!

Published on Sat, 01/06/2024 - 15:14

మధ్యప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. భోపాల్‌లో చట్టవిరుద్దంగా నిర్వహిస్తున్న షెల్టర్‌ హోమ్‌ నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. భోపాల్‌ శివారు ప్రాంతంలో అంచల్‌ బాలికల హాస్టల్‌ నిర్వహిస్తున్నారు.

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌(ఎన్‌సీపీసీఆర్‌) చైర్మన్‌ ప్రియాంక్‌ కనుంగో .. ఈ చిల్డ్రన్స్‌ హోమ్‌ను ఆకస్మికంగా సందర్శించారు. అయితే రిజిస్టర్‌ను తనిఖీ చేయగా.. అందులో 68 బాలికల ఎంట్రీలు ఉండగా.. 26 మంది గల్లంతైనట్లు గుర్తించారు. మిస్‌ అయిన వారిలో గుజరాత్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌, రైసెన్‌, చింద్వారా, బాలాఘాట్‌ ప్రాంతాలకు చెందిన బాలికలు ఉన్నారు. 

అదృశ్యమైన బాలికల గురించి షెల్టర్‌ హోమ్‌ డైరెక్టర్‌ అనిల్‌ మాథ్యూను ప్రశ్నించగా.. ఆయన పొంతన లేని సమాధానలు చెప్పాడు. అనుమానం వచ్చిన అధికారి.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో బాలికల హాస్టల్‌లో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. అసలు షెల్టర్‌ హోంను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తేలింది.

వీధుల్లో ఒంటరిగా కనిపించిన పిల్లలను ఒక చోట చేర్చి, ఎలాంటి లైసెన్స్‌ లేకుండా ఓ మిషనరీ( మత గురువు) ఈ షెల్టర్‌ హోమ్‌ను నడుపుతున్నట్లు కనుంగో ట్వీట్‌ చేశారు. రక్షించిన పిల్లలకు రహస్యంగా క్రైస్తవ మతాన్ని ఆచరించేలా చేశారని ఆరోపించారు. హాస్ట్‌లో ఎక్కువమంది అమ్మాయిలు ఆరు నుంచి 18 సంవత్సరాల వారేనని.. వీరిలో అధికంగా హిందువులే ఉన్నట్లు తెలిపారు. 

కాగా ఈ విషయం గురించి తెలుసుకున్న గవర్నర్‌.. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వ సీఎస్‌కు నోటీసులు పంపినట్లు తెలిపారు. ఇక షెల్టర్‌ హోంలోని మిగతా పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పజెప్పారు. 
చదవండి: రామమందిర ప్రారంభం.. ఆలయానికి వెళ్లి మహా హారతి ఇస్తా: ఉద్ధవ్‌

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)