Breaking News

ఇంట్లో పాముల కలకలం

Published on Sat, 04/26/2025 - 10:55

అన్నానగర్‌(త‌మిళనాడు): నాగర్‌కోయిల్‌ సమీపంలోని పల్లందురై లూర్దేస్‌ కాలనీలో నివాసం ఉంటున్న రీగన్‌(30) మత్స్యకారుడు. ప్రస్తుతం తన పాత ఇంటి దగ్గరే కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇందుకోసం ఏడాది కాలంగా నిరుపయోగంగా ఉన్న పాత ఇంటిని కూల్చివేయాలని రీగన్‌ నిర్ణయించుకున్నాడు. అక్కడ ఉంచిన వస్తువులను తొలగించే పని గురువారం జరిగింది. ఓ గదిలో ఉన్న బీరువా ఎత్తే ప్రయత్నంలో ఉండగా, దాని కింద నుంచి పెద్ద నాగుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. దీంతో కార్మికులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో పాము అక్కడి నుంచి పారిపోయింది. 

అనంతరం కార్మికులు బీరువాను తొలగించారు. అక్కడ చూసిన దృశ్యం చూసి షాక్‌ తిన్నారు. బీరువా కింద ఓ బొందలో బృందాలుగా మెలికలు తిరుగుతున్న పాము పిల్లలు, పాము పిల్లల మధ్య గుడ్లు కూడా పడి ఉన్నాయి. దీంతో వారు పాములు పట్టే సుందరదాస్‌కు సమాచారం అందించారు. అతను వచ్చి బొందలోంచి పాములను ఒక్కొక్కటిగా బయటకు తీశాడు. అందులో 24 నల్ల పాము పిల్లలు, 7 పాము గుడ్లు ఉన్నాయి. గుడ్లు ముట్టగానే, అవి బయటకి రావడం ప్రారంభించాయి. అనంతరం సుందరదాస్‌ పాము పిల్లలను, గుడ్లను సంచిలో వేసి వడచేరిలోని అటవీ శాఖ కార్యాలయంలో అప్పగించారు.  

#

Tags : 1

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)