Breaking News

టెక్కీ కన్నీటి గాథ.. ఉద్యోగం ఊడింది కన్న తల్లే ‘నిన్ను కనడమే దండగ’ అంది!

Published on Sun, 10/11/2026 - 07:54

పేరుకే ఐటీ ఉద్యోగం. లోప‌ల అంతా డొల్లే. రంగం ఏదైనా ఖాళీగా ఇంట్లో తిని కూర్చోకుండా ఉద్యోగం చేస్తున్నామా?. నాలుగు రాళ్లు సంపాదిస్తున్నామా? అని చూసుకోండి. ఉద్యోగం చేస్తుంటే రెండు, మూడు మార్గాల్లో ఆదాయం వచ్చేలా ప్లాన్ చేయ‌డం మంచిది లేదంటే? నాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌ బెట్టుకోండి. ఏఐ ఎరాలో ఉద్యోగం పోతే.. మ‌న‌ల్ని ఎవ‌రు ప‌ట్టించుకోరు. స్నేహితులు, బంధువులు కాదు మ‌న‌ల్ని క‌న్న తల్లిదండ్రులు నీకు తిండిపెట్ట‌డ‌మే దండ‌గ అంటారు. ఇప్పుడు నేను అది స్థితిలో ఉన్నానంటూ ఇటీవ‌ల లేఆఫ్స్ గురైన ఓ ఐటీ ఉద్యోగి త‌న సొంత ఇంట్లోనే చుట్టం చూపుగా వ‌చ్చిన బంధువు ప‌రిస్థితిలా త‌యారైందంటూ సోష‌ల్ మీడియాలో వాపోయాడు.  

టెక్కీ వయస్సు 22. టైర్-3 కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఓ సంస్థలో ఐటీ ఉద్యోగం సంపాదించాడు. నెలకు జీతం రూ.95,000! కోరిన ఉద్యోగం.. కోరుకున్నంత జీతం రావడంతో ఆ యువకుడి ఆనందానికి అవధులు లేవు. ఆ యువ‌కుడికి ఆనందానికి అవ‌ధుల్లేవు. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే చేతికి అందిన భారీ వేతనంతో ఆ టెక్కీ లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడ్డాడు. సొంత డబ్బులతో బైక్ కొనుగోలు చేయడంతో పాటు, పార్టీలు, పబ్‌లు, అవుటింగ్‌లతో వచ్చిన డబ్బునంతా ఖర్చు పెట్టేశాడు. భవిష్యత్తు కోసం ఎలాంటి సేవింగ్స్ చేసుకోలేదు. స‌రిగ్గా అదే స‌మ‌యం పిడిగులాంటి ఓ మెయిల్ త‌న జీవితాన్ని త‌ల‌కిందులు చేసింది.

తల్లిదండ్రుల తీవ్ర వ్యాఖ్యలు..
ఇంట్లో పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే.. కనీసం నన్ను ఒక బంధువులా కూడా చూడట్లేదు. తినే కంచాన్ని లాక్కుంటున్నారు. నీవల్ల ఉపయోగం ఏంటి? నిన్ను కనడమే మేం చేసిన తప్పు కావొచ్చు అంటూ కన్నవారే క్షోభ పెడుతున్నారు అని కంటతడి పెట్టాడు. పగటిపూట ఇంటర్వ్యూల కోసం ప్రిపేర్ కావడానికి, రాత్రిపూట సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేయడానికి కూడా ప్రయత్నించానని, కానీ ఎక్కడా అవకాశం దక్కలేదని వాపోయాడు.

తప్పు ఎక్కడ జరిగింది?
మొదటిసారిగా భారీ జీతం రాగానే ఆ యువకుడు లగ్జరీ జీవన శైలికి అలవాటు పడ్డాడు. బైక్ కొనుగోలు చేసినప్పటికీ, కనీసం భవిష్యత్తు కోసం ఎలాంటి ఎమర్జెన్సీ సేవింగ్స్ చేసుకోలేదు. డబ్బు లేకపోతే క‌న్న‌వారు కూడా మనవారు కాదనే కఠిన సత్యాన్ని ఈ అనుభవం నేర్పింది. ఎవరైనా సరే.. ఖరీదైన బైక్‌లు, కార్ల కోసం డబ్బు ఖర్చు పెట్టేముందు కష్టకాలంలో ఆదుకునేలా కనీస పొదుపు ఉండేలా చూసుకోండి హితవు పలికాడు.

సోషల్ మీడియా స్పందనలు..
ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించి ఆ టెక్కీకి మద్దతుగా నిలిచారు. ధైర్యం కోల్పోవద్దు. ఎవరికోసమో కాకుండా మీకోసం మీరు బతకడం నేర్చుకోండి అని కొందరు ధైర్యం చెప్పారు. డబ్బులు రాకపోతే కుటుంబంలో కూడా విలువ ఉండదు. నేను కూడా ఇలాంటి పరిస్థతినే ఎదుర్కొన్నాను అంటూ పలువురు లేఆఫ్ బాధితులు తమ అనుభవాలను పంచుకున్నారు. పిల్లలు కష్టకాలంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అండగా ఉండాలి కానీ, ఇలా మాట్లాడటం చాలా బాధాకరం. వీలైతే ఆ ఇల్లు వదిలి బయటకు వచ్చేయండి  అంటూ కొందరు సలహా ఇచ్చారు.

ఈ సంఘటన కేవలం ఆ యువకుడిది మాత్రమే కాదు, ఆర్థిక భద్రత లేకపోతే సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పే ఒక హెచ్చరిక లాంటిది. ఉద్యోగం పోయినప్పుడు ఆప్యాయతలను పంచాల్సిన బంధాలే భారంగా మారడం నిజంగా గుండెల్ని పిండేసే విషయమే!

ఇదీ చ‌ద‌వండి : భారత్‌లో స్టార్‌లింక్.. ఐదేళ్లుగా అదే ట్విస్ట్‌!

Videos

టీడీపీ నుండి YSRCP లోకి చేరిన వెంటనే వరాలు కురిపించిన రాచమల్లు

హీరోగా విజయ్ వారసుడు

నవరాత్రుల వేళ ఇదేం అపచారం..! పూజలు లేకుండానే అమ్మవారి నిమజ్జనం

5 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది.. మేడ్చల్ బాలిక కేసులో షాకింగ్ నిజాలు..

నాడు తిట్లు.. నేడు ప్రశంసలు 'ది హిందూ'లో మోదీపై చంద్రబాబు ప్రేమలేఖ

మూఢ నమ్మకంతో డీజిల్ పోసి తల్లినే చంపిన కొడుకు

పుష్ప శ్రీవాణి సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

దుర్గ గుడిలో సౌకర్యాలపై కేశినేని చిన్ని ని కడిగిపారేసిన భక్తులు

బాహుబలి కిలికి భాష గుర్తుందా..! వారణాసిలో అంతకు మించి..!

అరెస్ట్ చేయలేదు.. నన్ను కిడ్నాప్ చేశారు.. ధృవ్ రాఠీ సంచలన వీడియో

Photos

+5

ఇంద్రకీలాద్రిపై తొలిరోజు (ఫొటోలు)

+5

మల్లెపూలతో మెస్మరైజ్ చేస్తోన్న మంగళవారం బ్యూటీ.. (ఫోటోలు)

+5

రంభ ఊర్వశి మేనక బ్యూటీ రాశి సింగ్ లేటెస్ట్ పిక్స్.. (ఫోటోలు)

+5

రైళ్లు కిటకిట (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా రవితేజ కొత్త సినిమా తులాభారం ప్రారంభం.. (ఫోటోలు)

+5

హైదరాబాద్ : డ్యాన్స్‌తో అదరగొట్టిన విద్యార్థులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ షాన్-ఎ-దక్కన్ కార్ ర్యాలీ ప్రారంభించిన నటుడు సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

హీరో విజయ్ దేవరకొండ (ఫోటోలు)

+5

అందాల అర్చన.. ఆకట్టుకుందిలా.. (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (అక్టోబర్ 11 -అక్టోబర్ 17)