Breaking News

22 మంది మావోయిస్టుల లొంగుబాటు

Published on Fri, 07/11/2025 - 15:34

చత్తీస్‌గఢ్‌: తమతో చర్చలు జరపాలన్న మావోయిస్టుల విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. మావోయిస్టులు లొంగిపోవాల్సిందేనని, లేకపోతే ఏరివేత తమ ముందున్న లక్ష్యమని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విడతల వారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. తాజాగా మరో 22 మంది మావోయిస్టులు లొంగిపోఆయరు. 

ఈరోజు(శుక్రవారం,. జూలై 11) నారాయణపూర్‌ ఎస్పీ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన 22 మంది మాదోయిస్టుల్లో 8 మంది మహిళలున్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ. 37 లక్షల రివార్డ్‌ ఉంది.

కాగా, వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు సరెండర్‌ అవుతున్నారు. గత నెలలో  కొత్తగూడెం ఎస్పీ ముందు 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. గత ఏడు నెలల్లో  310కి పైగా మావోయిస్టులు లొంగిపోయారు.

మావోయిస్టు అగ్రనేతలు ఎక్కడున్నారు.. వారి కదలికలు ఎలా ఉన్నాయనే దానిపై పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందుకోసం మానవ వనరులతోపాటు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఈ క్రమాన అనేక మంది అగ్రనేతలకు సంబంధించిన జాడ తెలిసిన వెంటనే కూంబింగ్‌ మొదలుపెట్టారు. మావోలకు పట్టున్న ప్రాంతాల నుంచి వారిని బయటకు రప్పించేలా వ్యూహాత్మకంగా సెర్చ్‌ ఆపరేషన్లు చేపట్టారు.

భద్రతా దళాలకు ప్రతికూల పరిస్థితులు తక్కువగా ఉండే చోటుకు మావోలు వచ్చాక కూంబింగ్‌ తీవ్రతరం చేశారు. ఈ ఏడాది అగ్రనేతలు చనిపోయిన ఎదురుకాల్పుల్లో ఈ తరహా వ్యూహాలనే ఎక్కువగా అమలు చేసినట్టు సమాచారం. ఇదే మాదిరి మడావి హిడ్మా, బార్సే దేవా విషయంలోనూ పది రోజుల కిందట ఆపరేషన్‌ మొదలైనట్టు తెలుస్తోంది. 

హిడ్మా టార్గెట్‌గా ఆపరేషన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)