Breaking News

2018లో రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా

Published on Fri, 04/12/2024 - 18:34

లక్నో : 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం దావా కేసు విచారణ ఏప్రిల్‌ 22కి వాయిదా పడింది. ప్రత్యక కోర్టు న్యాయమూర్తి సెలువులో ఉన్న కారణంగా కేసు వాయిదా పడినట్లు తెలుస్తోంది. 

రాహుల్‌ గాంధీ.. హోమంత్రి అమిత్‌ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం సుల్తాన్‌ పూర్‌ జిల్లాకు చెందిన బీజేపీ నేత విజయ్‌ మిశ్రా సుల్తాన్‌ పూర్‌ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. మిశ్రా తరపు న్యాయవాది సంతోష్ పాండే మాట్లాడుతూ.. పరువు నష్టం దావా కేసులో రాహుల్‌ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేశామన్నారు. కానీ న్యాయమూర్తి సెలవులో ఉన్నందున విచారణ జరగలేదని, ఏప్రిల్ 22కి వాయిదా వేసినట్లు తెలిపారు. 

2018 మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ గాంధీ.. అమిత్‌ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నిజాయితీ, స్వచ్ఛమైన రాజకీయాలను విశ్వసిస్తుందని చెబుతున్నప్పటికీ, హత్య కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారని అన్నారు. అమిత్‌ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆగస్టు 4, 2018న రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతుంది 

కాగా, ఈ కేసులో గతేడాది డిసెంబర్‌లో రాహుల్ గాంధీపై కోర్టు వారెంట్ జారీ చేసింది. తదనంతరం, రాహుల్‌ గాంధీ ఫిబ్రవరి 20న అమేథీలో భారత్ జోడో న్యాయ్ యాత్రను నిలిపివేసి, కోర్టు నుంచి బెయిల్‌ పొందారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)