Breaking News

Delhi 10/11 Blast: అనుమానితుడి మొదటి ఫొటో..

Published on Tue, 11/11/2025 - 09:52

న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ మొదటి ఫొటో బయటకు వచ్చింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పేలిని తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు డాక్టర్ ఉమర్‌కు చెందినది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానిత ఆత్మాహుతి బాంబర్ మొదటి చిత్రాన్ని ‘ఎన్‌డీటీవీ’ యాక్సెస్ చేసింది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో 1989, ఫిబ్రవరి 24న జన్మించిన ఉమర్.. అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌, హర్యానా పోలీసు బృందాలు   అరెస్టు చేసిన వైద్యులు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌లకు డాక్టర్ ఉమర్ అత్యంత సన్నిహితుడు.

దర్యాప్తు అధికారులు మాడ్యూల్‌లోని ఇద్దరు కీలక సభ్యులను అరెస్టు చేశారని, 2,900 కిలోల అనుమానిత పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని తెలుసుకున్న డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్ నుండి పారిపోయాడు. తరువాత అతను భయాందోళనకు గురై పేలుడుకు పాల్పడ్డాడని సమాచారం. ఉమర్ మొహమ్మద్, అతని సహచరులు దాడి చేయడానికి అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ఏఎన్‌ఎఫ్‌ఓ)ఉపయోగించారు. వారు కారులో డిటోనేటర్‌ను ఉంచి ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతంలో దాడికి పాల్పడ్డారని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.

ఎర్రకోట సమీపంలో పేలిన తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు బదర్‌పూర్ సరిహద్దు నుండి ఢిల్లీలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ వీడియో, ఫొటోలలో కనిపిస్తోంది. కారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి పాత ఢిల్లీకి వచ్చింది. HR 26CE7674 నంబర్ ప్లేట్‌తో ఉన్న ఈ వాహనం ఎర్ర కోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు నిలిపి ఉంచారు. మధ్యాహ్నం 3:19 గంటలకు ప్రవేశించి సాయంత్రం 6:30 గంటలకు కారు బయలుదేరిందని భద్రతా వర్గాలు తెలిపాయి. అనుమానిత ఆత్మాహుతి దళ సభ్యుడు కారును ఒక్క నిమిషం కూడా వదిలి వెళ్లలేదని సమాచారం.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)