Breaking News

కొత్త చట్టాలు.. దేశంలోనే తొలి కేసు నమోదు!

Published on Mon, 07/01/2024 - 09:20

న్యూఢిల్లీ: దేశంలో కొత్త చట్టాలు జూన్‌ 30 అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. బ్రిటీష్‌ కాలం నాటి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)ని భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌)గా, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)ని భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఐఈఏ)ను భారతీయ సాక్ష్య అధినీయం(బీఎస్‌ఏ)గా మార్చారు. ఈ క్రమంలో తొలి కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది.

దేశ రాజధాని ప్రాంతంలోనే తొలి కేసు నమోదు కావడం గమనార్హం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ చిరు వ్యాపారి మీద గత అర్ధరాత్రి ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. పోలీసులు  పాట్రోలింగ్‌ నిర్వహిస్తున్న టైంలో..  ఆ‍ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్‌ బాటిల్స్‌ అమ్ముతూ కనిపించాడు. ఆ దుకాణం రోడ్డుగా అడ్డంగా ఉండడంతో పాటు.. దానిని తీసేయాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతను వినలేదని పోలీసులు చెబుతున్నారు.  

భారతీయ న్యాయ్‌ సంహిత క్రిమినల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 285 ప్రకారం.. అతనిపై కేసు నమోదు అయినట్లు సమాచారం. నిందితుడు బీహార్‌ పట్నాకు చెందిన పంకజ్‌ కుమార్‌గా గుర్తించారు. ఈ సెక్షన్‌ ప్రకారం.. రోడ్లను అతిక్రమించడం, తద్వారా ప్రమాదాలకు కారణం కావడం లాంటి చర్యలు నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. ఆ జరిమానా ఐదు వేల రూపాయల దాకా ఉంటుంది.

ఇదిలా ఉంటే.. కొత్త చట్టాల అమలుపై పోలీసు సిబ్బందికి మే 24 నుంచి జూన్‌ 25 వరకు శిక్షణను అందిన విషం తెలిసే ఉంటుంది. మూడు చట్టాల ద్వారా మారుతున్న డిజిటల్‌ యుగంలో సాంకేతికతను వాడుకునేందుకు సౌకర్యంగా తీర్చిదిద్దారు.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)