Breaking News

ఒక్క రోజులో 16 సూర్యోదయాలు: శుభాంశు

Published on Sat, 06/28/2025 - 20:11

న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్‌ఎస్‌)లో కి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన  ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లాతో ప్రభాని నరేంద్ర మోదీతో జరిపిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఈరోజు(శనివారం, జూన్‌ 28వ తేదీ) శుభాంశు శుక్లాతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. తొలుత శుభాంశును విష్‌ చేసిన ప్రధాని మోదీ.. ‘ఇది శుభ్‌ ఆరంభ్‌ అని, ఇది నయా శకం’ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మోదీ.. గొప్ప ఘనతను సాధించావంటూ కొనియాడారు. దానికి శుభాంశు బదులిస్తూ ఇది తన ఒక్కడి విజయం కాదని, భారత్‌ విజయమని వినమ్రతను చాటుకున్నారు. 

 

అదే సమయంలో అక్కడ ఎలా ఉంది అని మోదీ అడగ్గా... ఇక్కడ వాతావరణం అంతా భిన్నంగా ఉందని శుభాంశు తెలిపారు.  ఈ కక్ష నుంచి చూస్తే భారత్‌ చాలా స్పెషల్‌గా కనిపిస్తుందని శుభాంశు స్పష్టం చేశారు.  ఇక్కడ రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలుగా ఉందని చెప్పుకొచ్చారు.  ఈ కక్షలో పరిస్థితులకు అలవాటు పడుతున్నామని,  నిద్ర పోవడం అనేది చాలా పెద్ద చాలెంజ్‌గా ఉందన్నారు.  

ఇక్కడ గ్రావెటీ లేమి కారణంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయని శుభాంశు తెలిపారు.  తల కాస్త భారంగా ఉంటుందని, ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయని, ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులేనని తెలిపారు.  మీ యొక్క ఆశీర్వాదంతో ఐఎస్‌ఎస్‌లో అతి సులభంగా అడుగుపెట్టానని పేర్కొన్నారు శుభాంశు.  ఇక ఐఎస్‌ఎస్‌ నుంచి భారత్‌ చాలా పెద్దదిగా కనిపిస్తుందని, మ్యాప్‌ కంటే భిన్నంగా ఉందని మోదీ పేర్కొనగా, ఇక్కడ నుంచి చూస్తే భారత్‌ చాలా స్పెషల్‌గా కనిపిస్తుందని శుభాంశు తెలిపారు. ఇలా పలు విషయాలను పంచుకుంటూ ప్రధాని మోదీ-శుభాంశుల సంభాషణ కొనసాగింది. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)