Breaking News

ఒక్కరోజులో 415.8 మి.మీ వర్షపాతం.. ఎక్కడంటే..

Published on Mon, 06/02/2025 - 10:42

గౌహతి: అస్సాంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. జూన్‌ నెల మొదటి రోజున రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద నగరంగా పేరొందిన సిల్చార్‌(Silchar)లో 24 గంటల్లో ఏకంగా 415.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 1893 తర్వాత ఒక్క రోజులో  నమోదైన అత్యధిక వర్షపాతం. జూన్ 1న సిల్చార్‌లో కురిసిన వర్షపాతం 132 ఏళ్ల కిత్రం నాటి 290.3 మి.మీ వర్షపాతం రికార్డును బద్దలు కొట్టింది.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఎగువకు వీస్తున్న గాలి ‍ప్రభావం, అల్ప స్థాయి ద్రోణుల కలయిక ఈ అస్థిర వాతావరణానికి కారణంగా నిలుస్తోంది. 2022లో సిల్చార్ వరదల్లో చిక్కుకుంది. నాడు పట్టణంలోని 90 శాతం ప్రాంతం నీటితో నిండిపోయింది. కాగా గత మూడు రోజుల్లో  అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌(Arunachal Pradesh)లలో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 34 మంది మృతిచెందారు.

గడచిన ఐదు రోజుల్లో మేఘాలయ అంతటా భారీ వర్షపాతం నమోదైంది. మేఘాలయలోని 10 జిల్లాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యాయి. త్రిపురలో 10 వేల మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారు. మణిపూర్‌లో నదులు పొంగిపొర్లడం, కరకట్టలు తెగిపోవడం వల్ల సంభవించిన వరదల కారణంగా 19 వేల మందికి పైగా ప్రజలు పలు అవస్థలు పడుతున్నారు. వరదల కారణంగా 3,365 ఇళ్లు దెబ్బతిన్నాయి.

ఇది కూడా చదవండి: ‘స్పైడర్స్ వెబ్’ సక్సెస్‌: దాడుల వివరాలు షేర్‌ చేసిన జెలెన్‌స్కీ

#

Tags : 1

Videos

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)