Breaking News

అమ్మను కాపాడేందుకు.. 12 ఏళ్ల పిల్లాడి సాహసం!

Published on Thu, 06/29/2023 - 11:10

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఒక పిల్లవాడు తనకు తల్లిపై గల ప్రేమను చాటిన తీరు అందరినీ విస్మయపరుస్తోంది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నాన్న.. అమ్మను కొడుతుండటాన్ని సహించలేని ఆ పిల్లాడు తన స్థాయికి మించిన పని చేసి, అందరి చేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు. 

ఆగ్రా పోలీసులు ఈ ఉదంతం గురించి తెలియజేస్తూ.. ఆ పసివాడు తన తండ్రి హరిఓం(40) తన తల్లిని ఇనుప రాడ్డు, బెల్టుతో కొట్టడాన్ని చూశాడన్నారు. తరువాత ఆ పిల్లాడు బసోనీ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడన్నారు. ఈ ఉదంతం జెబ్రా గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసు అదికారి వీరేంద్ర కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ‘తమ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఆ పిల్లాడు బయటనే కూర్చున్నాడన్నారు. కొద్దిసేపటి తరువాత తన దగ్గరకు వచ్చి, తండ్రి హరిఓం తన తల్లిని బెల్టుతో, ఇనుప రాడ్డుతో కొట్టాడని ఫిర్యాదు చేశాడు. మద్యం తాగి వచ్చిన తన తండ్రి తన తల్లిని ఇదేవిధంగా కొడుతుంటాడని’ ఆ పిల్లాడు చెప్పాడన్నారు. 

హరిఓం ఆగ్రాలోని ఒక ప్రైవేటు ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. కాగా ఆ పిల్లాడి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఒక టీమ్‌ను వారి ఇంటికి పంపించారు. వారు అక్కడున్న హరిఓంను అరెస్టు చేశారు. తరువాత విడిచి పెట్టేశారు. ఈ సందర్భంగా అతని భార్య మాట్లాడుతూ తన భర్త తనను ఇకపై ఎప్పుడూ కొట్టబోనని ప్రమాణం చేశాడని, ఈ విషయం పోలీసులకు తెలియజేశాక పోలీసులు తన భర్తను విడిచిపెట్టేశారని తెలిపారు. 

3 కిలోమీటర్లు ఒంటరిగా నడుచుకుంటూ వచ్చి..

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ 12 ఏళ్ల పిల్లాడు 3 కిలోమీటర్ల దూరం ఒంటరిగా నడుచుకుంటూ వచ్చి, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆ పిల్లాడు తన తల్లిని.. తండ్రి ఏ విధంగా హింసిస్తున్నాడో వివరంగా తెలియజేశాడన్నారు. 

ఇది కూడా చదవండి: వీడియో: పోలీసాయన మంచి మనసు.. కారు బంపర్‌లో ఇరుక్కుపోతే..

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)