Breaking News

నవరాత్రుల్లో విషాదం

Published on Sun, 10/22/2023 - 07:42

దేశవ్యాప్తంగా ప్రస్తుతం దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా జరుగుతుండటం విశేషం. నవరాత్రులలో గుజరాత్‌లో నిర్వహించే గర్బా నృత్యాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న నవరాత్రి వేడుకల్లో యువతతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికలపై దాండియా ఆడుతున్నారు. 

నవరాత్రుల సందర్భంగా గుజరాత్‌లో జరుగుతున్న వేడుకల్లో గుండెపోటు కేసులు అత్యధికంగా వెలుగు చూస్తున్నాయి. గడచిన 24 గంటల్లో గర్బా నృత్యం చేస్తూ 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం జరుగుతున్న నవరాత్రులలో ఇప్పటివరకూ గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి అత్యవసర అంబులెన్స్‌లకు 521 కాల్స్‌ వచ్చాయి. నవరాత్రి వేడుకల్లో గుజరాత్‌లో ఒక్కసారిగా గుండెపోటు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 

గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా యువత గుండెపోటుకు గురవుతోంది. రాజ్‌కోట్‌లో 28 ఏళ్ల యువకుడు గర్బా నృత్యం చేస్తూ, గుండెపోటుకు గురై మృతి చెందాడు. రాయరోడ్డులోని ఓ బిల్డర్‌కు గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. అయితే వైద్యులు ఆ బిల్డర్‌ ప్రాణాలను కాపాడలేకపోయారు. అహ్మదాబాద్‌లోని హతీజన్‌లో గర్బా నృత్యం చేస్తున్న సమయంలో ఒక యువకుడు మృతిచెందాడు. ద్వారక, గ్రేటర్ అంబాలా, రాంనగర్‌లో ముగ్గురు యువకులు హఠాన్మరణం చెందారు. 

సూరత్‌లోనూ గత 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో కన్నుమూశారు. వడోదరలోని హర్ని ప్రాంతంలో గర్బా ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. దభోయ్‌లో కూడా 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. నవ్‌సారిలో ఒక యువకుడు గర్బా నృత్యంలో పాల్గొన్న అనంతరం గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అమ్రేలి, జామ్‌నగర్‌లో ఇద్దరు చొప్పున, ద్వారకలో ఇద్దరు రైతులు గుండెపోటుతో మరణించారు. అమ్రేలికి చెందిన దినేష్ షియాల్ (23) నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంలో మృతి చెందాడు. నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్న యువతలో గుండెపోటు సమస్య పెరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. 
ఇది కూడా చదవండి: పుల్‌ అండ్‌ పుష్‌ ట్రైన్‌ అంటే ఏమిటి?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)