Breaking News

ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్

Published on Sun, 09/17/2023 - 17:11

భువనేశ్వర్‌: ఓ వైపు కేరళలో నిఫా వైరస్ భీతికొల్పుతుండగా.. ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కలవరపెడుతోంది. రోజురోజుకు స్క్రబ్ టైఫస్ కేసులు ఆ రాష్ట్రంలో పెరుగుతుండటం ప్రజలను ఆందోళన గురిచేస్తోంది. తాజాగా సుందర్‌గఢ్‌ జిల్లాలో 11 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో స్క్రబ్ టైఫస్ బారిన పడినవారి సంఖ్య 180కి చేరింది.

ప్రధానంగా సందర్‌గఢ్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేసులతో ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 180కి చేరిందని జిల్లా వైద్య అధికారి కన్హుచరణ్ నాయక్ తెలిపారు. స్క్రబ్ టైఫస్ సోకినవారు ప్రధానంగా సుందర్‌గఢ్, బాలిశంకర ప్రాంతాలకు చెందినవారని స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుమానిత 50 షాంపిల్స్‌ను టెస్టుకు పంపించగా.. అందులో 11 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేశారు. మూడు రోజులకు మించి జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్క్రబ్ టైఫస్‌ను అరికట్టడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు వైద్య బృందాలను పంపించారు. కావాల్సినన్ని మందులు, వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆశా వర్కర్లు తిరుగుతూ జాగ్రత్తలు సూచిస్తున్నారు. 

ఇదీ చదవండి: మాధవన్ పోస్టుకు ప్రధాని మోదీ స్పందన

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)