Breaking News

Plane Crash: నా భూమిని ఆ తల్లే కాపాడింది..!

Published on Fri, 06/13/2025 - 16:35

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. ఎన్నో జీవితాల్లో చీకటి నింపింది. భార్యకు భర్తను, భార్యకు భర్తను, తల్లికి కూతుర్నీ, కూతురికి తండ్రిని దూరం చేసి తీరని విషాదాన్ని మోసుకొచ్చింది. 242 మందితో నిన్న(గురువారం, జూన్‌ 12వ తేదీ) మధ్యాహ్న సమయంలో అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిర్‌ ఇండియా విమానం.. టేకాఫ్‌ అయిన నిమిషాల వ్యవధిలో ఎయిర్‌పోర్ట్‌కు అత్యంత సమీపంలో కుప్పకూలిపోయింది. 

ఇందులో 230 ప్రయాణికులు,  ఇద్దరు పైలట్లు, 10 మంది విమానం సిబ్బంది ఉండగా, ఒక్క ప్రయాణికుడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. ఇలా బ్రతికి బయటపడింది ఒకరైతై.. ఫ్లైట్‌ మిస్‌ అయ్యి ప్రాణాలు దక్కించుకుంది ఒక మహిళ. 

లండన్‌కు వెళ్లాల్సిన గుజరాత్‌ రాష్ట్రంలోని భరూచ్‌కు చెందిన భూమి చౌహాన్‌ అనే మహిళ.. అహ్మదాబాద్‌లో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి కాస్త ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకుంది. తన ఫ్లైట్‌ మిస్‌ అయ్యిపోయిపోతుందేమోనని  గాబరా గాబరాగా ఎయిర్‌పోర్ట్‌ వైపు అడుగులు వేసింది. కానీ చివరకు ఆమె ఫ్లైట్‌ ఎక్కలేదు. బోర్డింగ్‌ ప్రాసెస్‌కు ఆమె సమయానికి రాలేకపోవడంతో ఫ్లైట్‌ మిస్‌ చేసుకుని బ్రతికిపోయింది. 

‘నేను ఎయిర్‌పోర్ట్‌లో బయటకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడే విమానం కూలిపోయిందనే సమాచారం దావానంలా వ్యాపించింది.  అది నేను వెళ్లాల్సిన ఎయిర్‌ ఇండియా 171 బోయింగ్‌ విమానం.  ఆ వార్తతో నాకు కాళ్లు కదల్లేదు. చాలా సేపటివరకూ నేను షాక్‌లోనే ఉన్నా. ఆ ఫ్లైట్‌ మధ్యాహ్నం 1.10కి టేకాఫ్‌ అవుతుంది. బోర్డింగ్‌ ప్రోసెస్‌ అంతా 12.10 కల్లా కంప్లీట్‌ చేయాలి. 

కానీ నేను 12.20కి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చా. నేను చెక్‌ ఇన్‌ గెట్‌ దగ్గరికి వచ్చి వారిని రిక్వస్ట్‌ చేశా. మొత్తం ప్రొసెస్‌ అంతా త్వరగా కంప్లీట్‌ చేస్తానన్నాను..కానీ వారు నన్ను అనుమతించలేదు. దాంతో ఎయిర్‌పోర్ట్‌ నుంచి నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ బయటకు వచ్చీ రావడంతో ఫ్లైట్‌ కూలిపోయింది. 

దాంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాను వెళ్లాల్సిన ఫ్లైట్‌ కూలిపోయిందనే వార్తతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు ఆమ స్సష్టం చేసింది. తాను అంచుల వరకూ వెళ్లి వెనక్కి వచ్చినట్లు అనిపించిందన్నారు భూమి. తనను విమాన ప్రమాదం నుంచి తప్పించినందుకు తన ఇష్ట దైవం గణపతికి కృతజ్ఞతలు తెలియజేశారు. గణపతే తనను సేవ్‌ చేశాడని ఆందోళనగా మాట్లాడారు. 

 

ఇక భూమి తల్లి మాట్లాడుతూ..  ఈ విమాన ప్రమాదం నుంచి తన కూతురు తప్పించుకున్నందుకు నిజంగా ఆ దేవీ మాతకు  ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తక్కువేనన్నారు. ‘ నా కూతురు తన బిడ్డను నా వద్ద వదిలి లండన్‌కు బయల్దేరింది. నిజంగా ఆమె ఒంటరిగా విమానం ఎక్కి ఉంటే ఆమె కూతురు అనాథ అయ్యేది. తన కూతురు సేఫ్‌గా ఇంటికొచ్చిందని, ఆ విమాన ప్రమాం తలుచుకుంటేనే భయంగా ఉంది.  నా  కూతుర్ని ఆ దేవతే కాపాడింది’ అని  పేర్కొన్నారు.

భూమి చౌహాన్‌ తండ్రి మాట్లాడుతూ.. ‘ భారీ ట్రాఫిక్‌తో నా కూతురు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం కాస్త ఆలస్యమైంది. దాంతో బోర్డింగ్‌ ప్రాసెస్‌కు అనుమతించలేదు. మేము రిక్వస్ట్‌ చేసినా వారు అనుమతించలేదు.  ఆ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు బయటకు వచ్చేశాము. అంతే కాసేపటికే మేము అక్కడ ఉండగానే ఆ విమానం కూలిపోయిందనే వార్త తెలిసింది’ అని ఆమె తండ్రి తెలిపారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు