Breaking News

నా కుమారుడు చావు అంచులదాకా వెళ్లొచ్చాడు: నటుడు

Published on Fri, 10/25/2024 - 18:19

పిల్లలు జబ్బుపడితే తల్లిదండ్రులు విలవిల్లాడిపోతారు. అలాంటిది ప్రాణాపాయంలో ఉంటే ఆ పేరెంట్స్‌ గుండె ఎంత విలవిల్లాడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనక్కూడా అలాంటి పరిస్థితి ఎదురైందంటున్నాడు బాలీవుడ్‌ నటుడు జాయేద్‌ ఖాన్‌.

ఊపిరాడలేదు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నా పెద్ద కొడుకు జిడాన్‌కు మూడేళ్ల వయసున్నప్పుడు శ్వాసకోస సమస్యతో బాధపడ్డాడు. ఓసారి లండన్‌లో ఉండగా అతడికి శ్వాస తీసుకోవడం కష్టమైంది. నాన్న, ఊపిరాడటం లేదు, సాయం చేయమని అర్థిస్తున్నాడు. ఇంతలో నా భార్య అంబులెన్స్‌కు ఫోన్‌ చేసింది. 15 నిమిషాల్లో అంబులెన్స్‌ రావడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. వాడి పరిస్థితి చూసిన నర్స్‌ ఒకరు బతకడం కష్టమన్నారు.

దేవుడి దయ వల్ల..
నా సంతకం తీసుకున్నాక జిడాన్‌కు అడ్రినలైన్‌ ఇంజెక్షన్‌ ఇచ్చారు. వెంటనే సిటీలో ఎక్కడెక్కడో ఉన్న నలుగురు డాక్టర్లను ఆస్పత్రికి పిలిపించారు. స్టెరాయిడ్లు పని చేయకపోతే మెడ దగ్గర కోసి సర్జరీ చేస్తామన్నారు. దేవుడి దయ వల్ల కాసేపటికే స్టెరాయిడ్స్‌ పని చేయడంతో సర్జరీ అవసరం లేదన్నారు. లండన్‌లోని హెల్త్‌ కేర్‌ సిస్టమ్‌ను కచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే' అన్నాడు. కాగా జాయేద్‌-మలైకా దంపతులకు 2008లో జిడాన్‌లో జన్మించాడు. 2011లో ఆరిజ్‌ అనే మరో కుమారుడు పుట్టాడు.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)