Breaking News

ఎన్టీఆర్‌తో సినిమా ఎందుకు చేయలేదు? డైరెక్టర్ వైవీఎస్ సమాధానమిదే

Published on Sat, 08/10/2024 - 10:20

ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియని టాలీవుడ్ దర్శకుడు వైవీఎస్ చౌదరి.. చాన్నాళ్ల తర్వాత మెగాఫోన్ పట్టుకున్నారు. నందమూరి హరికృష్ణ కొడుకు జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్‌ అనే కుర్రాడ్ని హీరోగా పరిచయం చేస్తున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. తాజాగా మూవీకి సంబంధించిన మరో ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో భాగంగా జూ.ఎన్టీఆర్ గురించి ఆసక్తికర ప్రశ్న ఎదురవగా.. దానికి సమాధానమిచ్చారు.

ఎన్టీఆర్‌ని విపరీతంగా అభిమానించే వైవీఎస్.. అప్పట్లో హరికృష్ణ, బాలకృష్ణతో సినిమాలు తీశారు. కానీ అప్పటికే ఫామ్‌లో ఉన్న జూ.ఎన్టీఆర్‌తో మాత్రం మూవీ ఏం చేయలేదు. అయితే కావాలనే చేయలేదా? లేదంటే కుదరలేదా? అనే ప్రశ్న తాజాగా ప్రెస్‌మీట్‌లో ఎదురైంది. దీనికి వైవీఎస్ చెప్పిన సమాధానం ఏంటంటే..

(ఇదీ చదవండి: ఈసారి తెలుగమ్మాయిని పరిచయం చేస్తున్నాను: వైవీఎస్‌ చౌదరి)

'నేను రెండుమూడేళ్లకు ఓసారి సినిమా చేస్తుంటా. స్టోరీ నేనే రాసుకోవడం వల్ల ఆలస్యమవుతూ ఉంటుంది. దీనికి ఎవరు సరిపోతారో వారిని మాత్రమే ఎంపిక చేసుకుంటా. పెద్ద హీరోలతో సినిమాలు తీయాలని నేను అనుకోను. తారక్‌తో సినిమా చేయాలనే ఆలోచన నాకు రాలేదు. అందుకే ఆయనతో తీసే స్టోరీ నా ఆలోచనల్లోకే రాలేదు. ఆ ఐడియా వస్తే కచ్చితంగా వెళ్తా' అని వైవీఎస్ క్లారిటీ ఇచ్చారు.

కొత్త సినిమా ఏ జానర్ లో ఉండబోతుంది అనే విషయాలేం బయటపెట్టిన వైవీఎస్.. వీణా రావు అనే తెలుగమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. అలానే కీరవాణి, చంద్రబోస్, బుర్రా సాయిమాధవ్ లాంటి టాప్ టెక్నీషియన్స్ ఈ మూవీ కోసం పనిచేయబోతున్నారని చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్‌మెంట్.. ఇ‍ప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య)

Videos

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్