Breaking News

వెండితెరపై కనిపించనున్న మరో ఎన్టీఆర్‌

Published on Mon, 06/10/2024 - 12:22

సీతారామరాజు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వైవీఎస్‌ చౌదరి. తెలుగుదనం ఉట్టిపడేలా విభిన్న కథలతో సినిమాలు రూపొందించిన ఆయన కొంతకాలం బ్రేక్‌ ఇచ్చారు. ఇప్పుడు నందమూరి నాలుగో తరం నుంచి ఒకరిని వెండితెరకు ఆయన పరిచయం చేయనున్నాడు. ఈ విషయం గురించి వైవీఎస్‌ చౌదరి తాజాగా అధికారికంగా ప్రకటన చేశారు.

స్వర్గీయ హరికృష్ణ గారి మనమడిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు వైవీఎస్‌ చౌదరి ప్రకటించారు. హరికృష్ణ పెద్ద కుమారుడు స్వర్గీయ జానకీ రామ్‌ అబ్బాయి  'తారక రామారావు'ను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం తనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు. తన తాతగారి పేరుతో నాలుగో తరం నట వారసుడిగా తారక రామారావు ఎంట్రీ ఇవ్వనున్నాడు. న్యూ టాలెంట్‌ రోర్స్‌ బ్యానర్‌లో యలమంచిలి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిల్లలతో రూపొందిన పౌరాణిక చిత్రం ‘దానవీర శూర కర్ణ’లో కృష్ణుడి పాత్రలో బాల నటుడిగా తారక రామారావు నటించాడు.

వైవీఎస్‌ చౌదరి సినీ కెరీర్‌లో  మంచి హిట్స్ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో సాయి ధుర్గ తేజ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆయనే నిర్మాతగా 'రేయ్‌' సినిమాను డైరెక్ట్‌ చేశారు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. ఆ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత నందమూరి వారసుడి సినిమాతో మళ్లీ ఆయన మెగా ఫోన్‌ పట్టబోతున్నారు.

Videos

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్