Breaking News

యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌పై అధికారిక ప్రకటన

Published on Tue, 08/20/2024 - 10:46

యువరాజ్‌సింగ్‌ పేరు చెబితే వెంటనే గుర్తుకొచ్చేది ఆరు సిక్స్‌లు.. ఇప్పుడా సీన్‌ను వెండితెరపై మళ్లీ చూసే అవకాశం రానుంది. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా 2007 సెప్టెంబర్‌ 19న ఇంగ్లాండ్‌తో జరిగిన  లీగ్‌ మ్యాచ్‌లో యవరాజ్‌సింగ్‌ వీర బాదుడుకి ఇంగ్లాడ్‌ చేతులెత్తేసింది. స్టువర్ట్ బ్రాడ్‌ వేసిన 19వ ఓవర్‌లో మన యూవీ 6 సిక్సర్లు బాదేసి రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. 2011 వరల్డ్‌ కప్‌ విజయంలో యూవీ పాత్ర చాలా ఎక్కువగానే ఉంది. గ్రౌండ్‌లో వీరోచితంగా పోరాడే ఈ వీరుడి బయోగ్రఫీ వెండితెరపైకి రానుంది.

ఇప్పటికే సచిన్‌, ధోనీ వంటి క్రికెటర్ల బయోపిక్‌లు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. తాజాగా యువరాజ్‌ సింగ్‌ బయోపిక్‌ను నిర్మిస్తున్నట్లు నిర్మాతలు భూషణ్‌ కుమార్‌, రవిభాగ్ చందక్‌ ప్రకటించారు. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణసంస్థ టీ సిరీస్‌ భాగస్వామ్యంతో ఈ చిత్రం రానుంది. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తామని వారు చెప్పారు. అయితే, ఇందులో యువరాజ్‌సింగ్‌ పాత్రలో ఎవరు కనిపిస్తారా..? అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

నిజం చెప్పాలంటే యువరాజ్‌సింగ్‌ జీవితంలో చాలా  వీరోచిత పోరాటాలు ఉన్నాయి. ఫిట్‌నెస్‌ కోల్పోయినప్పుడు ఇక యూవీ గుడ్‌బై చెబుతాడని అందరూ భావించన సమయంలో తను సత్తా చాటి మళ్లీ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. క్యాన్సర్‌ను జయించి చాలామందిలో ధైర్యాన్ని నింపాడు. అలా ప్రతీది యూవీ జీవితం ఒక ప్రత్యేకం అని చెప్పవచ్చు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)