యువన్‌ శంకర్‌రాజా బిగ్‌ ప్లాన్‌.. డైరెక్టర్‌గా ఎంట్రీకి లైన్‌ క్లియర్‌

Published on Thu, 10/17/2024 - 06:23

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా రాణిస్తున్న అతి కొద్దిమందిలో యువన్‌ శంకర్‌రాజా ఒకరు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారసుడైన ఈయన ప్యార్‌ ప్రేమ కాదల్‌ అనే చిత్రం ద్వారా నిర్మాతగానూ మారారు. అందులో నటుడు హరీశ్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటించారు. ఆ తరువాత విజయ్‌సేతుపతి హీరోగా మామనిదన్‌ చిత్రాన్ని నిర్మించారు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా ఈయన సంగీతాన్ని అందించిన గోట్‌ చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. మరిన్ని చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్న యువన్‌ శంకర్‌ రాజా త్వరలో దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. 

ఇటీవల ఒక యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన భేటీలో ఆయన పేర్కొంటూ త్వరలో మోగాఫోన్‌ పట్టనున్నట్లు చెప్పారు. తాను దర్శకత్వం వహించే చిత్రంలో నటుడు శింబును కథానాయకుడిగా నటింపజేస్తానని చెప్పారు. ఈయనకు నటుడు శింబుకు మధ్య మంచి స్నేహం ఉంది. దీంతో ఈయన దర్శకత్వంలో నటించడానికి శింబు ఒకే చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. 

నటుడు శింబు ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్‌ కథానాయకుడిగా నటించిన థగ్‌లైఫ్‌ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు. తదుపరి కమలహాసన్‌ తన రాజ్‌ కమల్‌ పిలింస్‌ పతాకంపై నిర్మించనున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ కథా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం తరువాత యువన్‌శంకర్‌రాజా చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారేమో చూడాలి.
 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)