Breaking News

యువతిని మోసం చేసిన కేసు.. స్పందించిన హర్షసాయి

Published on Wed, 09/25/2024 - 12:02

యువతిని మోసం చేసిన కేసులో యూట్యూబర్ హర్షసాయిపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, నగ్న చిత్రాలతో తనని బెదిరిస్తున్నాడని ఓ యువతి మంగళవారం ఫిర్యాదు చేసింది. ఇది జరిగినప్పటి నుంచి హర్షసాయి అందుబాటులో లేడు. ఇతడితో పాటు తం‍డ్రి రాధాకృష్ణ గురించి పోలీసులు వెతుకున్నారు. ఇప్పుడు ఈ ఆరోపణలపై హర్షసాయి స్పందించాడు. ఇన్ స్టా వేదికగా క్లారిటీ ఇచ్చాడు.

'అవన్నీ తప్పుడు ఆరోపణలు. డబ్బులు దండుకోవడం కోసమే నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నా గురించి మీకు తెలుసు. నిజానిజాలు త్వరలో బయటకొస్తాయి. మా లాయర్ తానికొండ చిరంజీవి ఈ విషయమై త్వరలో మీ ముందుకు వస్తారు' అని ఇన్ స్టా స్టోరీలో హర్షసాయి రాసుకొచ్చాడు.

(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి)

వైజాగ్‌కి హర్షసాయి.. పేదోళ్లకు డబ్బులు సాయం చేస్తూ వాటిని వీడియోలుగా తీసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్‪‌లోడ్ చేస్తుంటాడు. అయితే ఈ కుర్రాడికి ఇన్నేసి లక్షల రూపాయలు ఎక్కడనుంచి వస్తున్నాయనేది పెద్ క్వశ్చన్ మార్క్. ఇది కాదన్నట్లు బెట్టింగ్ యాప్స్‌ని విపరీతంగా ప్రమోట్ చేస్తుంటాడు. కొన్నిరోజుల క్రితమే ఈ విషయమై విమర్శలు వచ్చాయి.

	హర్ష సాయి సంచలన ఆడియో లీక్

ఇవన్నీ పక్కనబెడితే సొంతంగా కథ రాసుకుని 'మెగా' అనే సినిమాని గతేడాది లాంచ్ చేశారు. ఇందులో హీరోయిన్‌గా నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న అమ్మాయే.. ఇప్పుడు హర్షసాయిపై కేసు పెట్టింది. తన దగ్గర రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపిస్తోంది. ఇప్పుడు ఈ కేసు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ)

Videos

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్