Breaking News

సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి

Published on Wed, 04/23/2025 - 11:46

‘పాడుతా తీయగా’(Padutha Theeyaga) గురించి గాయని ప్రవస్తి (Pravasthi) చేసిన ఆరోపణలపై ఇప్పటికే సింగర్‌ సునీత, నిర్మాత ప్రవీణ (Praveena Kadiyala) క్లారిటీ ఇచ్చారు. అయితే, తాజాగా వాటికి సమాధానంగా ప్రవస్తి మరో వీడియో చేసి తన యూట్యూబ్‌ ఛానల్‌లో విడుదల చేసింది. ఈ క్రమంలో సింగర్‌ సునీతకు పలు ప్రశ్నలు సిందిస్తూ.. వాటికి సమాధానం చెప్పాలని కోరింది.

'సునీత గారు మీరు ఒక రీల్‌ పోస్ట్‌ చేస్తూ నా గురించి మాట్లాడారు.  ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానం చెప్పండి. మీరు రీల్‌లో చాలా చక్కగా మాట్లాడారు. రియల్‌లో కూడా ఇలాగే మాట్లాడింటే ఇదంతా జరిగేది కాదు. పాటల ఎంపిక విషయంలో  ఛానల్‌కు  రైట్స్‌ ఉన్న వాటిని మాత్రమే నేను సెలెక్ట్‌ చేసుకున్నాను. నేను ఎప్పుడూ ఆ లైన్‌ దాటలేదు. ఛానల్‌కు ఉన్న రైట్స్‌ ప్రకారం నేనొక పాటను ఎంపిక చేసుకుని రిహార్సల్‌ పూర్తి చేసుకున్న తర్వాత నో చెప్పారు. కానీ, అదే ఎపిసోడ్‌లో అదే పాటను మరో అమ్మాయి పాడింది. దానిని మీరు ఎంకరేజ్‌ చేశారు. ఎందుకు..? 

మరోసారి 'కన్యాకుమారి' అనే పాట పాడక ముందే మీరు జడ్జిమెంట్‌ ఇచ్చేసి వెళ్లిపోయారు. ఇదెంత వరకు కరెక్ట్‌ చెప్పిండి..? స్టేజీపై పాట మధ్యలో లిరిక్స్‌ మరిచిపోయిన వారు ఎందుకు టాప్‌లో ఉన్నారు..? చేతి మీద రాసుకొచ్చిన వారిని మీరు ఎంకరేజ్‌ చేయలేదా..? లిరిక్స్‌ మరిచిపోయిన వారిని ఫైనల్‌ వరకు ఎలా తీసుకొచ్చారు..? మ్యాంగో వీడియోలో పాడే అవకాశం నాకు మీరు (సునీత) ఇవ్వలేదు మేడం.. మా గురువు గారు నిహాల్‌ కొండూరి ఆ ఛాన్స్‌ ఇచ్చారు. నేను పాడింది కూడా ఆయన కంపోజ్‌లోనే. సాంగ్‌ పూర్తి అయిన తర్వాత నన్ను, మా అమ్మను చాలా సేఫ్‌గా ఇంటికి చేర్పించానని చెప్పారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఆరోజు మా అమ్మ నాతో లేదు. నన్ను మీ అసిస్టెంట్‌ ప్రోగ్రామ్‌ కోసం తీసుకెళ్లేందుకు మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలోనే మళ్లీ ఇంటి వద్దకు చేర్చే బాధ్యత మీదే అని మీ అసిస్టెంట్‌తో మా అమ్మ చెప్పింది.

కీరవాణి గారు కూడా స్టేజీపైనే కొన్ని మాటలు అన్నారు. అవి నన్ను బాధించాయి. పెళ్లి వేడుకలలో పాటలు పాడేవారు సింగర్స్‌ ఎంతమాత్రం కాదని ఆయన అన్నారు. అది చాలా హర్ట్‌ చేసే విషయం అని చెప్పాను. అందులో తప్పేముంది..?  నాకిప్పుడు 19 ఏళ్లు. సంగీతమే నా ప్రాణం అని బతుకుతున్నాను. అందుకోసం నా చదువును కూడా వదులుకున్నాను. ఐదేళ్ల వయసు నుంచే నేను పాటల పోటీలలో ఉన్నాను. ఇన్నేళ్ల కెరీర్‌లో ఓటమి, విజయం నాకు కొత్త కాదు. నేను ఎలాంటి డిప్రెషన్‌లో లేను. నా వెనుక ఎవరూ లేరు. సొంతంగా పాటలు రెడీ చెసి విడుదల చేసేంత డబ్బులు మాకు లేవు. ఓటమి వచ్చినా తట్టకుని నిలబడే శక్తి నాకు ఉంది. కానీ, అన్యాయం జరిగింది కాబట్టే ప్రశ్నిస్తున్నాను. మీరంటే నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. మీరోక లెజండరీ సింగర్‌.. ఎప్పటికీ నా అభిమాన సింగర్‌ మీరే..' అంటూ సునీతకు పలు ప్రశ్నలు ప్రవస్తి సందించింది. అయితే, సంగీతమే తన ప్రపంచం అని నమ్ముకుని 14 ఏళ్ల పాటు పాటల ప్రపంచంలోనే బతికిన ప్రవస్తికి ఛాన్సులు వస్తాయా..? అనే ప్రశ్నలు నెజన్లలో వస్తున్నాయి. ఈ వివాదంలో ఎక్కువగా ప్రవస్తికే నెటిజన్లు మద్ధతుగా నిలుస్తున్నారు.

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)