Breaking News

రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్‌ హీరో

Published on Wed, 09/20/2023 - 18:23

టాలీవుడ్‌ హీరో రాజా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. గతకొంతకాలంగా పాస్టర్‌గా దైవసేవలో మునిగి తేలుతున్న ఆయన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నాడు. విజయవాడలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నాడు.

ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. 'నాకు రాజకీయాలు కొత్తేం కాదు. ఇంతకుముందు తెర వెనుక పని చేశాను. ఇప్పుడు మీ ముందుకు వచ్చి పని చేసేందుకు రెడీ అయ్యాను. కేవలం ఒక రాష్ట్రం కోసమే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీలో చేరాను' అని చెప్పుకొచ్చాడు.

సినిమాలకు దూరం..
'ఆనంద్‌: మంచి కాఫీలాంటి సినిమా'తో తెలుగువారికి దగ్గరయ్యాడు హీరో రాజా. 2002లోనే ఓ చిన్నదాన సినిమాతో వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ 2004లో వచ్చిన ఆనంద్‌ మూవీతోనే అసలు సిసలైన సక్సెస్‌ రుచి చూశాడు. ఆ నలుగురు, వెన్నెల చిత్రాలతో మరింత గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ తర్వాత సినిమాల ఎంపికలో తడబడ్డాడు. ఫలితంగా హిట్లు కరువైపోయాయి. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమయ్యాడు. 2013 తర్వాత మరే సినిమా చేయలేదు. కాగా రాజా.. 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నాడు.

చదవండి: ప్రియుడితో జయసుధ? మరోసారి తెరపైకి మూడో పెళ్లి రూమర్స్‌!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)