Breaking News

'కెజియఫ్' రేంజ్ కలలలో కుర్ర హీరో

Published on Tue, 01/27/2026 - 23:11

టాలీవుడ్‌లో కొత్తగా అడుగుపెడుతున్న యంగ్ హీరోలలో చాలామంది "కెజియఫ్ రేంజ్"లో సినిమాలు చేయాలని కలలు కంటున్నారు. మేకప్ వేసుకున్న వెంటనే తమ రేంజ్ వేరే లెవల్‌ అని భావించే ఈ తరం హీరోలు తమ వ్యక్తిత్వం ఏమిటి? తమ వాయిస్, నటనకు ఏం సూటవుతాయి? ఎలాంటి పాత్రలు చేయాలనే విషయాలపై మాత్రం పెద్దగా ఆలోచించరు.  

అలా కొంతమంది హీరోలకు చేతిలో సినిమాలు లేకపోయినా "పాన్ ఇండియా" సినిమానే చేస్తానని, మాస్ సినిమానే చేస్తానని గట్టిగా చెప్పేస్తున్నారు. ఇక వారసత్వం ఉన్నవారైతే మరింత ధైర్యం చేస్తున్నారు. ఇటీవల ఓ నిర్మాత ఒక కథకు సరిపోతాడని భావించి ఓ చిన్న హీరోను కలిశాడు. కాగా సదరు హీరో నిర్మాతకు ఫోన్‌లో ఓ వీడియో చూపించాడు. తీరా చూస్తే అది అతనిపై తానే తయారు చేయించుకున్న గ్లింప్స్. అది కెజియఫ్ లెవెల్‌లో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి సినిమా చేద్దామని హీరో ప్లాన్ చెప్పాడట. అయితే దానికి సదరు నిర్మాత మాత్రం 'గ్లింప్స్ బాగుంది కానీ మీకు అంతగా సూట్ కాలేదు" అని చెప్పి వెళ్లిపోయాడని సమాచారం.

కెజియఫ్ లాంటి చిత్రాలు అందరికీ సెట్‌ కావు. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి సినిమానే చేస్తానని కలలతో కాలక్షేపం చేస్తున్న కుర్ర హీరోలు, ఏజ్ బార్ అయ్యాకే వాస్తవం గ్రహిస్తారు. కానీ అప్పటికే తన తండ్రి ఇచ్చిన ఆస్తి కూడా ఖర్చయిపోయి, కెరీర్‌లో స్థిరపడే అవకాశాలు తగ్గిపోతాయి. టాలీవుడ్‌లో కొత్తగా వస్తున్న హీరోలు తమకు సూటయ్యే పాత్రలు, కథలు ఎంచుకుంటేనే నిలబడగలరనే వాస్తవాన్ని గ్రహించాలి. లేకపోతే "కెజియఫ్ రేంజ్" కలలతోనే వారి కెరీర్ ముగిసే ప్రమాదం ఉంది.  

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)