Breaking News

దళపతి విజయ్‌తో యంగ్ డైరెక్టర్‌.. హిట్‌ కొడతాడా?

Published on Tue, 12/19/2023 - 14:36

కోలీవుడ్ స్టార్ హీరో  దళపతి విజయ్‌ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కోసం చాలా మంది డైరెక్టర్స్ ఎదురు చూస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్‌ ఒప్పించడం అంత సులభం కాదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న 68వ చిత్రం. ఇందులో త్రిష నాయకిగా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో విజయ్‌ తన 69వ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తాజా సమాచారం. కాగా ఇటీవల జవాన్‌ చిత్రంతో బాలీవుడ్‌లోనూ విజయ బావుటా ఎగురవేసిన అట్లీ విజయ్‌ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. వీరిది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

మెర్సల్‌, బిగిల్‌ వంటి విజయవంతమైన చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చినవే. ఇదిలా ఉండగా విజయ్‌ను దర్శకత్వం వహించే దర్శకుల లిస్ట్‌లోకి యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దూసుకొచ్చారన్నది తాజా సమాచారం. వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడైన ఈయన తాజాగా జిగర్తండ డబుల్‌ ఎక్స్‌ వంటి హిట్‌ చిత్రం చేయడం గమనార్హం. 

కాగా.. కార్తీక్‌ సుబ్బరాజ్‌ నటుడు విజయ్‌ కోసం ఒక కథను సిద్ధం చేసి.. దాన్ని ఆయనను కలిసి వినిపించినట్లు తెలిసింది. కథ నచ్చడంతో విజయ్‌ కూడా అందులో నటించడానికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. తదుపరి విజయ్‌ నటించే ఇదే అవుతుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. అంతే కాకుండా 2024 మార్చి లేదా ఏప్రిల్లో ఈ క్రేజీ కాంబోలో చిత్రం సెట్‌ పైకి వెళ్లనున్నట్లు టాక్‌. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)