Breaking News

దసరాకు పోటీగా పరారీ? క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Published on Sun, 04/02/2023 - 18:33

యోగేశ్వర్, అతిధి జంటగా నటించిన చిత్రం పరారీ. సాయి శివాజీ దర్శకత్వం వహించగా గాలి ప్రత్యూష సమర్పణలో, శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై జివివి గిరి నిర్మించాడు. మార్చి 30న రిలీజైన ఈ సినిమా సక్సెస్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. సీనియర్‌ నటుడు సుమన్ మాట్లాడుతూ.. 'ప్రతి గురు, శుక్రవారం నాడు ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు. అలా ఈసారి పరారీ ద్వారా యోగేశ్వర్‌ హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో నేను పోలీస్ ఆఫీసర్‌గా మంచి పాత్రలో నటించాను. నాతో పాటు చాలా మంది సీనియర్స్ నటించడం విశేషం' అన్నారు.

చిత్ర నిర్మాత గిరి మాట్లాడుతూ.. 'మా సినిమా చూసిన వారందరూ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. హీరో సాంగ్స్, యాక్షన్ ఫైట్స్‌ సీన్లలో బాగా చేశాడని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. సుమన్ గారు మాకు బ్యాక్ బోన్ గా ఉండి ఫుల్ సపోర్ట్ చేశారు. చాలా మంది ఈ సినిమా నాని గారి "దసరా"కు మా సినిమా పోటీ అంటున్నారు. అలా ఏం కాదు. ఆ సినిమా స్టోరీ వేరు, మా సినిమా స్టోరీ వేరు. నాకు రాముడు భక్తి ఎక్కువ అందుకే శ్రీరామ నవమి రోజు రిలీజ్ చేయాలని చేశాము తప్ప పోటీగా విడుదల చేయాలనే ఉద్దేశం లేదు. సోమవారం నుంచి థియేటర్స్ పెంచుతున్నాము' అన్నారు.

హీరో యోగేశ్వర్ మాట్లాడుతూ.. 'ఇది నా మొదటి చిత్రం.  చాలా బాగా చేశానని ప్రశంసలు లభిస్తుంటే సంతోషంగా ఉంది. నా మొదటి సినిమాలోనే మా గురువుగారు సుమన్, ఆలీ, జీవా, భూపాల్ వంటి సీనియర్  యాక్టర్స్ తో నటించడం హ్యాపీగా ఉంది. వీరంతా నన్ను కొత్త వాడు అని చూడకుండా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. అలాగే వారి నుంచి చాలా నేర్చుకున్నాను. మా సినిమా టెక్నీషియన్స్‌కు కూడా స్పెషల్‌ థ్యాంక్స్‌ చెపుతున్నాను' అన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)