Breaking News

‘యశోద’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ .. సమంత క్రేజ్‌ మాములుగా లేదుగా!

Published on Sat, 11/12/2022 - 11:28

స్టార్‌ హీరోయిన్‌ సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం(నవంబర్‌ 11) విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు మంచి స్పందన లభించింది. సరోగసీ నేపథ్యంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా  తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత పోరాట  ఘట్టాలు ప్రేక్షలను మెప్పించాయి.  టీజర్‌, ట్రైలర్‌కు భారీ స్పందన లభించడంతో తొలిరోజు భారీ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చేసుకున్నారు.  ఫలితంగా ఫస్ట్‌డే ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి. 

(చదవండి: ‘యశోద’ మూవీ రివ్యూ)

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం యశోద చిత్రం మొదటి రోజు  దేశవ్యాప్తంగారూ. 3.25 కోట్లు కలెక్ట్‌ చేసింది.  తెలుగు రాష్ట్రాల విషయానికొసే​.. నైజాంలో రూ.84 లక్షలు, సీడెడ్‌లో రూ.18 లక్షలు, ఆంధ్రాలో రూ.63 లక్షలు వసూలు చేసింది.  ఇక ఇతర ప్రాంతాల విషయానికొస్తే.. తమిళనాడులో రూ.14 లక్షలు, మలయాళంలో రూ.10 లక్షలు, కర్ణాటక, రెస్టాఫ్‌ ఇండియాలో కలిసి రూ.20 లక్షల వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.84 లక్షలు కలుపుకుంటే ఈ చిత్రం మొత్తంగా రూ.3.25 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి.  అయితే ఇది సమంత క్రేజ్‌కి ఎక్కువనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోలకు సైతం తొలి రోజు ఈ స్థాయి కలెక్షన్స్‌ రావడంలేదు. ఆ విషయంలో సమంత సక్సెస్‌ సాధించనట్లే. కానీ యశోదకు అయిన బిజినెస్‌ దృష్ట్యా ఈ వసూళ్లు తక్కువని ఈ సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

యశోద చిత్రానికి రూ.21 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే కనీసం రూ.22.5కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. తొలి రోజు రూ.3.25 కోట్లు రాబట్టడంతో ఈ సినిమా ఇంకా రూ.19.25ట్లు వసూళ్లు చేయాల్సి ఉంటుంది. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)