Breaking News

Yashoda: డూప్‌ లేకుండా సమంత యాక్షన్‌ సీన్స్‌.. మేకింగ్‌ వీడియో వైరల్‌

Published on Tue, 11/01/2022 - 17:49

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన 'యశోద' థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ... అన్ని భాషల్లో, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలు పెంచింది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్  సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో డూప్ లేకుండా సమంత యాక్షన్ సీన్స్ చేశారు. ఈ రోజు యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. సమంత డెడికేషన్, సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ఆ వీడియోలో యానిక్ బెన్ మాట్లాడారు.

'యశోద' యాక్షన్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన యానిక్ బెన్ మాట్లాడుతూ ''నేనెప్పుడూ యాక్టర్ సేఫ్‌గా ఉండేలా చూసుకుంటాను. వాళ్ళకు యాక్షన్ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్‌గా తెలియాలి. అందుకని, ముందుగా స్టంట్ పెర్ఫార్మర్లతో ఫైట్ కంపొజిషన్ చూపిస్తాం. నటీనటులకు ట్రైనింగ్ ఇస్తాం. అందువల్ల, వాళ్ళకు టైమింగ్ తెలుస్తుంది. ఆ తర్వాత ఫైట్ తీస్తాం. సమంత చాలా డెడికేటెడ్‌గా షూటింగ్ చేస్తారు. ప్రతిసారి తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఆమెతో షూటింగ్ చేయడం బాగుంటుంది. యాక్షన్ ఎప్పుడూ రియల్‌గా ఉండటం నాకు ఇష్టం. 'యశోద'లో స్టంట్స్ కూడా రియల్‌గా ఉంటాయి. రియల్ లైఫ్‌లో ఎలా జరుగుతుందో... 'యశోదలో యాక్షన్ కూడా అలాగే రియలిస్టిక్‌గా ఉంటుంది. కిక్ బాక్సింగ్, జూడో , మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్... 'యశోద' యాక్షన్ సీన్స్‌లో ఉంటాయి' అని అన్నారు.

సమంత నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' కు యానిక్ బెన్ వర్క్ చేశారు. తెలుగులో తెలుగులో పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది', మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే' చిత్రాలకు కూడా యానిక్ బెన్ పని చేశారు.

Videos

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)