Breaking News

యశ్ టాక్సిక్.. భారీ ధరకు తెలుగు రాష్ట్రాల రైట్స్..!

Published on Fri, 02/06/2026 - 19:12

శాండల్‌వుడ్ హీరో యశ్ నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ యాక్షన్ థ్రిల్లర్‌ టాక్సిక్. కేజీఎఫ్-‌ 2  తర్వాత రాకింగ్‌ స్టార్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ సీన్‌ పెట్టడంపై దర్శకురాలిపై విమర్శలు చేశారు. ఈ చిత్రానికి  గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహంచారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.

అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ సినీ ప్రియులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టాక్సిక్‌ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను భారీ డీల్‌కు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ పంపిణీ హక్కుల కోసం ఏకంగా రూ. 120 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఓ డబ్బింగ్ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్‌గా రికార్డ్ సృష్టించనుంది.

ఈ మూవీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాకు ఇదొక బిగ్ డీల్‌ అని టాలీవుడ్‌లో చర్చ మొదలైంది.

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. 'యశ్ సినిమా రంగంలో ఒక పవర్‌ఫుల్‌ స్టార్‌గా ఎదిగారు. కేజీఎఫ్ -2 తర్వాత ప్రపంచవ్యాప్తంగా అతని మార్కెట్ మరింత పెరిగింది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ  తర్వాత వస్తోన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అందించడానికి థ్రిల్‌గా ఉన్నాం. భవిష్యత్తులో యశ్‌తో మరిన్ని చిత్రాలకు కలిసి పనిచేస్తాం'  అని అన్నారు.

ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రోడక్షన్స్, మాన్ స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్పై వెంకట్‌ కె.నారాయణ, యష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ మూవీలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు  రవి బస్రూర్ సంగీతం అందించారు.
 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)