Breaking News

ఆ పోస్టర్‌ వద్ద ఫొటోలు తీసుకున్నాం: యామినీ భాస్కర్‌

Published on Fri, 12/05/2025 - 03:29

‘‘సైక్‌ సిద్ధార్థ’ చిత్రంలో స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయి శ్రావ్య పాత్ర చేశాను. విడాకులు తీసుకున్న అమ్మాయి... తనకు ఒక పిల్లాడు ఉంటాడు. తన బిడ్డ భవిష్యత్‌ కోసం భర్త నుంచి విడిపోయి ఎలాంటి జీవితాన్ని లీడ్‌ చేసింది? అన్నది ఆసక్తిగా ఉంటుంది. శ్రావ్య పాత్రలో నటనకి చాలా స్కోప్‌ ఉంది. ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది’’ అని యామినీ  భాస్కర్‌ తెలిపారు.

శ్రీ నందు హీరోగా వరుణ్‌ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘సైక్‌ సిద్ధార్థ’. రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా, నందునెస్‌ కీప్‌ రోలింగ్‌ పిక్చర్స్‌పై శ్రీ నందు, శ్యామ్‌ సుందర్‌ రెడ్డి తుడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా యామినీ భాస్కర్‌ మాట్లాడుతూ– ‘‘నర్తనశాల’ సినిమా తర్వాత రెండేళ్లు గ్యాప్‌ వచ్చింది. కోవిడ్‌ తర్వాత ఏ సినిమా చేయాలి? ఎలాంటి పాత్ర చేయాలని ఆలోచిస్తున్నప్పుడు... ఓ ఫ్రెండ్‌ ద్వారా డైరెక్టర్‌ వరుణ్‌ని కలిశాను.

శ్రావ్య పాత్ర గురించి ఆయన చెప్పగానే ఓకే అన్నాను. సహజమైన ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా అందరూ రిలేట్‌ అయ్యేలా ఉంటుంది. సురేష్‌బాబు, రానాగార్లకు మా సినిమా నచ్చడంతో విడుదల చేస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో మా ‘సైక్‌ సిద్ధార్థ’ పోస్టర్‌ చూసుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆ పోస్టర్‌ వద్ద డైరెక్టర్‌ వరుణ్, నేను ఫొటోలు కూడా తీసుకున్నాం. ఈ సినిమా చూసిన డైరెక్టర్‌ సాయి రాజేశ్‌గారు.. ‘ఈ చిత్రంలో నటనకు స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ చేశారు. ఇప్పటి నుంచి గ్యాప్‌ ఇవ్వకుండా సినిమాలపై ప్రత్యేకంగా ఫోకస్‌ చేయండి’ అని చెప్పడం హ్యాపీగా అనిపించింది. మంచి పాత్రలు వస్తే ఓటీటీ మూవీస్, వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తాను’’ అని చెప్పారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)