Breaking News

కుడికాలి వేలు తీసేశారు.. తొడపై చర్మాన్ని తీసి..: యాదమ్మరాజు

Published on Mon, 07/31/2023 - 16:55

జబర్దస్త్‌ కమెడియన్‌ యాదమ్మ రాజు కొద్దిరోజులుగా కాలికి కట్టుతో కనిపిస్తున్నాడు. తాజాగా స్లమ్‌డాగ్‌ హజ్బెండ్‌ ఈవెంట్‌లో కూడా అతడు చేతికర్ర సాయంతో నడుస్తూ కనిపించాడు. తనకు అంత పెద్ద గాయం ఎలా అయింది? ఏం జరిగిందనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు కమెడియన్‌.

యాదమ్మరాజు మాట్లాడుతూ.. 'చాయ్‌ తాగడానికి బయటకు వెళ్లాను. అప్పుడే అటుగా వచ్చిన వ్యక్తి బైక్‌ స్కిడ్‌ అవడంతో నన్ను గుద్దేశాడు. కుడికాలి వేలు తీసేశారు. తొడ భాగం నుంచి చర్మం తీసేసి వేలు దగ్గర అతికించారు. ప్రాణం పోయినట్లనిపించింది. ఇప్పటికీ చాలా నొప్పిగా ఉంది. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనాలి కదా అని ఈవెంట్స్‌లో, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇంత జరిగినా ప్రమోషన్స్‌కు వచ్చిన యాదమ్మరాజుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మునుపటిలా పరుగులు పెట్టకుండా ఇంట్లో ఉండి కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు.

ఇకపోతే పటాస్‌ కామెడీ షోతో పాపులరయ్యాడు యాదమ్మ రాజు. తన పంచులు, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల పెదవులపై నవ్వులు పూయించాడు. జబర్దస్త్‌ షోతో మరింత మందికి చేరువైన ఈ కమెడియన్‌ ప్రియురాలి స్టెల్లా రాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ యూట్యూబ్‌ వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం బుల్లితెర షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు యాదమ్మ రాజు.

చదవండి: బిగ్‌బాస్‌ 7 ప్రారంభమయ్యేది అప్పుడే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)