Breaking News

ఆరేళ్లకే యూట్యూబ్ సంచలనం.. 16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద.. ప్రపంచంలోనే సంపన్నుడిగా!

Published on Sun, 12/01/2024 - 17:14

ఈ రోజుల్లో మిలియనీర్‌  కావాలంటే మాటలు కాదు. బిజినెస్‌లో రాణించేవారికే ఆ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కోట్ల సంపాదన కూడబెట్టాలన్న వ్యాపారంలో రాణిస్తేనే సాధ్యమవుతుంది. కానీ 16 కోటీశ్వరుడైతే ఎలా ఉంటుంది. ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అలా చిన్న వయసులోనే కోట్లు సంపాదించిన బాలనటుడు ఒకరు ఉ‍న్నారు. అతని పేరే ఇయాన్ ఆర్మిటేజ్. ఇంతకీ అతను ఎలా సంపాదించాడో తెలుసుకుందాం.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బాలనటుడిగా ఇయాన్ ఆర్మిటేజ్ నిలిచారు. ఆరేళ్లకే తన యూట్యూబ్ వీడియో సిరీస్ ఇయాన్ లవ్స్ థియేటర్ ద్వారా యూట్యూబ్ స్టార్‌గా సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత తొమ్మిదేళ్లకే ప్రైమ్‌టైమ్ టీవీ షోలో లీడ్ రోల్‌లో కనిపించాడు. 2008లో జార్జియాలో జన్మించిన ఇయాన్ ఆర్మిటేజ్ 2017లో నటనలో ఎంట్రీ ఇచ్చాడు. ది గ్లాస్ కాజిల్, అవర్ సోల్స్ ఎట్ నైట్, ఐయామ్ నాట్ హియర్ లాంటి చిత్రాలతో పాటు లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్, బిగ్ లిటిల్ లైస్ లాంటి టీవీ షోల్లో మెరిశాడు.

అయితే యంగ్ షెల్డన్ అనే సిట్‌కామ్‌తోనే ఇయాన్ ఆర్మిటేజ్ మరింత ఫేమస్ అయ్యాడు. తొమ్మిదేళ్లకే లీడ్‌ రోల్ పోషించిన బాలనటుడిగా నిలిచాడు. దాదాపు ఏడేళ్ల పాటు ఈ సిట్‌కామ్‌లో కనిపించాడు. ఈ  సిరీస్ ఏడు సీజన్ల తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో  ముగిసింది.

16 ఏళ్లకే రూ.50 కోట్ల సంపద..

యంగ్ షెల్డన్‌లో పాత్రకు గానూ ఇయాన్   ఒక ఎపిసోడ్‌కు 30 వేల డాలర్లు పారితోషికం అందుకున్నాడు. సీజన్ -1 కోసం ఏకంగా రూ.4.6 కోట్లు సంపాదించాడు. ఈ సిట్‌కామ్‌ సీజన్ -5 నాటికి ఒక్కో సీజన్‌కు దాదాపు రూ.8 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. దీంతో 13 ఏళ్లకే ప్రపంచంలో మిలినీయర్లలో ఒకరుగా నిలిచాడు. అతని నికర ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి ప్రపంచంలోనే అత్యంత సంపన్న బాల నటుడి రికార్డ్ సృష్టించాడు.

యూట్యూబ్ నుంచి మొదలైన ఇయాన్ ఆర్మిటేజ్ ఏకంగా టీవీ స్టార్‌గా ఎదిగారు. యంగ్ షెల్డన్‌ సిరీస్‌తో స్టార్‌డమ్‌ తెచ్చుకున్న ఇయాన్ మరో రెండు చిత్రాలలో నటించాడు. స్కూబ్, పా పెట్రోల్: ది మూవీస్‌లో కనిపించాడు. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)