Breaking News

అతిపెద్ద సినిమా స్క్రీన్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ పోద్ది!

Published on Wed, 09/13/2023 - 19:52

మనలో చాలామందికి సినిమా చూడటం వ్యసనం. మందు తాగేవాడికి మత్తు ఎక్కితే కిక్ వస్తుంది. సినిమా చూసేవాడికి స్క్రీన్ ఎంత పెద్దగా ఉంటే.. అంత కిక్ వస్తుంది. ఎందుకంటే ఓ యాక్షన్ సీన్ పెద్ద తెరపై చూస్తుంటే అప్పుడు వచ్చే మజా.. బయట ఎక్కడా దొరకదు కదా! అయితే ఐమాక్స్, సూళ్లురుపేటలోని వి-ఎపిక్ స్క్రీన్స్ ఇప్పటివరకు పెద్దవని అనుకున్నాం. కానీ వాటికి బాబు లాంటి స్క్రీన్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే మీకు ఫ్యూజులు ఎగిరిపోవడం గ్యారంటీ.

ఈ స్క్రీన్ సంగతేంటి?
సాధారణంగా సినిమా స్క్రీన్  ఓ గోడ ఆకారంలో అంటే స్క్వేర్ షేపులో ఉంటుంది. దాదాపు ఎక్కడ చూసినా సరే ఇలాంటివే ఉంటాయి. కానీ అమెరికాలోని లాస్ వెగాస్‍‌లో మాత్రం రౌండ్(గోళాకారం) షేపులో బంతిలా ఉండే స్క్రీన్‌ని సిద్ధం చేశారు. ప్రస్తుతం అందరూ దీన్ని రాకాసి స్క్రీన్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే దీని పొడవు, వెడల్పు అలాంటిది మరి.

(ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్‌బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!)

ఈ స్క్రీన్ ప్రత్యేకతలు
మిగతా వాటి సంగతేమో గానీ ఈ స్క్రీన్ 366 అడుగుల పొడుగు, 516 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ థియేటర్ లో ఏకంగా 18,600 మంది ఒకేసారి కూర్చుని సినిమా చూడొచ్చు. ఈ స్క్రీన్ కి తోడుగా 1,60,000 స్పీకర్లు(చిన్నా పెద్దా కలిపి) ఉన్నాయి. మన దగ్గర ప్రస్తుతం 4K రెజుల్యూషన్ ఉంది. ఈ స్క్రీన్‌లో 18K రెజుల్యూషన్‌తో ప్లే అవుతుంది. ఇందులో మూవీ వేయాలంటే.. ఆ ఫైల్ సైజు 5 లక్షల జీబీ(GB) ఉండాల్సిందే.

ఫస్ట్ సినిమా అదే
ఇకపోతే అక్టోబరు 6న 'పోస్ట్ కార్డ్ ఫ్రమ్ ఎర్త్' సినిమాని.. ఈ రాకాసి స్క్రీన్‌పై ప్లే చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని చూసిన నెటిజన్స్.. వామ్మో అనకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి చోట సినిమా చూస్తే చాలు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి స్క్రీన్ రావాలంటే ఇప్పట్లో అస్సలు సాధ్యం కాదు!

(ఇదీ చదవండి: గ్లామర్ డోస్ పెంచిన నిహారిక... తమన్నా ముద్దులే ముద్దులు)

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)