Breaking News

దర్శన్‌ని పెళ్లి చేసుకుంటా.. జైలు ముందు మహిళ హంగామా

Published on Fri, 09/06/2024 - 19:07

చిత్రదుర్గం రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి సెంట్రల్‌ జైలులో ఉన్న నటుడు దర్శన్‌ని చూడాలని  ఓ మహిళ అక్కడ హంగామా చేసింది. తాజాగా జైలు వద్దకు కలబుర్గికి చెందిన లక్ష్మీ అనే యువతి అక్కడకు వచ్చింది. తాను దర్శన్‌ను చూడాలని, జైల్లోకి వదలాలని సిబ్బందిని పట్టుబట్టింది. పోలీసులు అడ్డుచెప్పడంతో వారితో వాగ్వాదానికి దిగింది. దర్శన్‌ కుటుంబ సభ్యులు మాత్రమే కలవడానికి అనుమతి ఉందని ఆమెకు తెలిపారు. 

అయితే, తాను దర్శన్‌ని పెళ్లి చేసుకుంటానని, అప్పుడు కలవడానికి ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించింది. దీంతో కంగుతిన్న పోలీసు అధికారులు ఆమెను జైలు నుంచి పంపించే ప్రయత్నం చేశారు. తాను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వద్దకు కూడా వెళ్లి వచ్చానని అక్కడ కూడా దర్శన్‌ను కలిసేందుకు అవకాశం దొరకలేదని  రాద్దాంతం చేసింది. చివరికి పోలీసులు ఆమెకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.

కన్నడ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గ వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో నటుడు దర్శన్‌, పవిత్రగౌడ, మరో 15 మంది పాత్ర ఉందంటూ ధృవీకరిస్తూ పోలీసులు 3,991 పేజీలతో కూడిన  చార్జిషీట్‌ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులు దర్శన్‌ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో పవిత్రగౌడను అసభ్యంగా కామెంట్లు చేస్తున్నాడని రేణుకాస్వామిని  కిరాతకంగా దర్శన్‌ అనుచరులు హతమార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)