Breaking News

'పుష్ప 2' కోసం బన్నీ.. మెగా సపోర్ట్ ఎక్కడ?

Published on Mon, 11/18/2024 - 11:35

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ రిలీజైంది. చివర్లో బన్నీ చెప్పిన డైలాగ్‌లా వైల్డ్ ఫైర్‌లా ఉంది. ట్రైలర్ సంగతి అటుంచండి. పాట్నాలో ఆదివారం సాయంత్రం ఈవెంట్ జరిగితే లక్షకు పైగా జనాలు వచ్చారు. ఏ మాత్రం ముఖపరిచయం లేని ఓ తెలుగు హీరో కోసం ఇంతమంది రావడం ఏంటా అని చాలామంది ఇప్పటికే షాక్‌లో ఉన్నారు. అయితే టాలీవుడ్ మాత్రం 'పుష్ప 2'ని సరిగా పట్టించుకోవట్లేదా అనిపిస్తుంది!

'బాహుబలి' ముందు వరకు టాలీవుడ్ అంటే దేశంలో ఓ ఇండస్ట్రీ మాత్రమే. కానీ ఈ సినిమా దెబ్బకు దేశవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మార్మోగిపోయింది. దీని తర్వాత 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' తదితర చిత్రాలతో ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఆయా సినిమాల రిలీజ్ టైంలో తెలుగు స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది సపోర్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

(ఇదీ చదవండి: పుష్ప 2 ట్రైలర్‌.. ఈ అర గుండు నటుడు ఎవరంటే?)

'పుష్ప 2' విషయానికొస్తే ట్రైలర్ రిలీజ్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత నాగవంశీ, హీరో శర్వానంద్ లాంటి కొద్దిమంది తప్పితే టాలీవుడ్‌ నుంచి అనుకున్నంతగా సపోర్ట్ రావడం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఇప్పటివరకు ట్వీట్ గానీ పోస్ట్ గానీ వేయలేదు. దీన్నిబట్టే అర్థమవుతోంది 'పుష్ప 2' కోసం అందరూ ఉన్నా బన్నీ ఒంటరిగానే పోరాడుతున్నాడని!

టాలీవుడ్ నుంచి అనుకున్నంత సపోర్ట్ రానంత మాత్రాన 'పుష్ప 2'కి వచ్చిన నష్టమేమి లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌ దెబ్బకు రూ.1000 కోట్ల కలెక్షన్ అనే మాట వినిపిస్తోంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం సౌత్‌లో ఏమో గానీ బాలీవుడ్, ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం పూనకాలు గ్యారంటీ. 

(ఇదీ చదవండి: మహేశ్-ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన 'పుష్ప 2' ట్రైలర్)

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)