Breaking News

43 ఏళ్లు దాటినా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే: నటి

Published on Thu, 03/14/2024 - 07:48

అలా మొదలైంది, మేం వయసుకు వచ్చాం వంటి సినిమాలతో నటి స్నిగ్ద మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన ఆహార్యంతోనే స్నిగ్ద టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది.  అడపిల్లే అయినా మగరాయుడి గెటప్‌లో ఆమె పండించే హాస్యానకి ఫ్యాన్స్‌ ఫిదా అవుతారు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ స్నిగ్ద మగరాయుడే అని చెప్పవచ్చు. ఏ విషయంలో అయినా సరే ఆమె డేర్‌గా ఉంటారనేది నిజం. 

వాస్తవంగా స్నిగ్ద శివ భక్తురాలు, ప్రతీ సంవత్సరం శివమాల ధరిస్తానని ఆమె గతంలో కూడా పలు వేదికల మీద తెలిపారు.  ఓ ఫ్రోగ్రామ్‌లో స్నిగ్దను చూసిన డైరెక్టర్‌ నందినీ రెడ్డి మొదట ఆమెకు  ‘అలా మొదలైంది' సినిమాలో చాన్స్‌ ఇచ్చింది. ఆ సినిమాలో తన పాత్రకు మంచి పేరు రావడంతో వరుస అవకాశాలు అందుకుంది.

స్నిగ్ద తన పెళ్లి గురించి మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ఆమె వయసు 43ఏళ్లు. అయినా ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదని ఓ ఇంటర్యూలో ఎదురైన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పింది. 'నాకు పెళ్లి బంధంపై పెద్దగా నమ్మకం లేదు. అందుకే పెళ్లి చేసుకోవాలనే ఫీలింగ్‌ కూడా కలగలేదు. ఇప్పటి వరకు నా జీవితంలో అలాంటి సందర్భం కూడా రాలేదు. ప్రస్తుతం నేను దీక్షలో ఉన్నాను. 120 రోజుల పాటు ఇలా దీక్షలోనే టైమ్‌ గడిచిపోతుంది. పెళ్లి చేసుకుంటే నేను మరోకరి ఆధీనంలోకి వెళ్లిపోతాను. అందుకే మ్యారేజ్‌ చేసుకోవడం అంటే అంతగా ఇష్టం లేదు. అని ఆమె తెలిపింది.

పెళ్లి చేసుకుని ఆ తర్వాత పిల్లల్ని కని జీవితం అంతా వారి చుట్టూ తిరిగే బదులు హాయిగా సంపాదించిన దాంట్లో కొంత మనకోసం ఖర్చు పెట్టుకుంటూ.. మిగిలన డబ్బు అనాథశ్రమాలలోని పిల్లలకు ఉపయోగిస్తే వాళ్లు బాగు పడుతారు. ప్రస్తుతం నేను అలాంటి పనే చేస్తున్నానని ఆమె తెలిపింది. ఫైనల్‌గా తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అయితే మాత్రం లేదని ఆమె తేల్చేసింది.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)