Breaking News

'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్‌కు అర్చకుల సూచన

Published on Mon, 06/16/2025 - 07:44

రిషబ్‌ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార ఎంత హిట్‌ అయ్యిందో తెలియనిది కాదు, చిన్న బడ్జెట్‌తో తీస్తే కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. దేశంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రానికి కాంతార: చాప్టర్‌ 1 పేరుతో పార్ట్‌ 2 తీస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అనుకున్నట్లు సాగడం లేదు. ప్రారంభం నుంచి అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు ఈ సినిమాకు ఎదురవుతున్నాయి. జూనియర్‌ ఆర్టిస్టు కపిల్‌, నటుడు రాకేశ్‌ పూజారి, మిమిక్రీ కళాకారుడు నిజు వీకే ఈ సినిమాలో నటిస్తూ, ఆకస్మికంగా మరణించారు. ఇంతలో శనివారం రాత్రి షూటింగ్‌ చేస్తున్న పడవ మునిగిపోయింది.

ఆర్టిస్టుల ఆకస్మిక మరణాలు

● కేరళకు చెందిన ఎంఎఫ్‌ కపిల్‌ జూనియర్‌ ఆర్టిస్టుగా ఈ కాంతారా చాప్టర్‌ 1లో నటిస్తూ ఉండేవాడు. ఉడుపి జిల్లా కొల్లూరు వద్ద ఉన్న సౌప ర్ణికా నదిలో కపిల్‌ ఈత కొడుతూ నది లో మునిగి చనిపోయాడు. మే 6న సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది.

● కామెడి కిలాడిగళు ద్వారా పేరు పొందిన రాకేశ్‌ పూజారి మంచి హాస్యనటుడు. ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే మే 12న ఉడుపిలో ఓ పెళ్లి వేడుకలో గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. హీరో రిషబ్‌ శెట్టి ఆయన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదని రాకేశ్‌ ఆత్మీయులు ఆవేదన వ్యక్తం చేశారు.

● సరిగ్గా నెలరోజులకు జూన్‌ 12న కాంతార చాప్టర్‌ 1లో నటిస్తున్న కేరళకు చెందిన మిమిక్రీ కళాకారుడు నిజు వికే మరణించాడు. ఆగుంబే హోం స్టేలో నిజు విశ్రాంతి తీసుకుంటూ గుండెపోటుతో తనువు చాలించారు.

ప్రమాదాలు సైతం

● గతేడాది నవంబర్‌లో కొల్లూరు మార్గంలో షూటింగ్‌ సభ్యులతో వెళుతున్న బస్సు పల్టీ కొట్టింది. 20 మంది జూనియర్‌ ఆర్టిస్టులు గాయపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.

● కాంతార చాప్టర్‌ 1 సినిమా కోసం కుందాపుర వద్ద భారీ సెట్‌ ఒకటి వేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సెట్లను నిర్మించారు. అయితే సుడిగాలుల కారణంగా సెట్‌ ధ్వంసం అయి ఆస్తి నష్టం కలిగింది.

● హాసన్‌జిల్లా హెరూరు గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో గోమాళ స్థలంలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు వివాదం రాజుకుంది. ఈ సినిమా షూటింగ్‌ కోసం అడవులను నాశనం చేస్తున్నారని, పేలుళ్లు జరిపారని గ్రామస్తులు ధర్నా చేశారు. అటవీ శాఖాధికారులు కూడా తనిఖీ చేశారు.

రిషబ్‌కు అర్చకుల సూచన
రిషబ్‌ శెట్టి కొన్ని రోజుల క్రితం కద్రి బారైబెల్‌ వారాహి పంజుర్లి , జారందాయ దైవం ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సమయంలో రిషబ్‌ శెట్టికి అర్చకులు హెచ్చరికలు ఇచ్చినట్లు తెలిసింది. నీ కార్యం సఫలం కాకుండా పాడు చేసేందుకు పథకాలు నడుస్తున్నాయి అని పేర్కొన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, సినిమాను ఎలాగైనా అక్టోబర్‌ 2న విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా కష్టాలు అంతటా హాట్‌ టాపిక్‌ అయ్యాయి.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)