Breaking News

జూనియర్‌ ఎన్టీఆర్‌కు అస్వస్థత అంటూ వార్తలు.. నిజమేంటంటే?

Published on Tue, 08/09/2022 - 18:39

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఈ క్రమంలో ఆయన తర్వాతి సినిమాల మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఎన్టీఆర్‌ అనారోగ్యం బారిన పడ్డాడని, దీంతో ఈ సినిమా షూటింగ్‌ కొంతకాలం వాయిదా పడనుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. తారక్‌ భుజం నొప్పితో బాధపడుతున్నాడని, అతడు కనీసం నాలుగు వారాలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడట. ముందైతే కొరటాల శివను పక్కా సాలిడ్‌ స్క్రిప్ట్‌ రెడీ చేయమని చెప్పాడట. అప్పటివరకు తన ఫ్యామిలీతో కలిసి హాలీడే టూర్‌ను ఎంజాయ్‌ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు తారక్‌. కాగా ఎన్టీఆర్‌30గా రూపొందే ఈ చిత్రాన్ని కల్యాణ్‌ రామ్‌ సమర్పణలో యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణలు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాకు అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నాడు. 

చదవండి: పదునైన ఆయుధంతో సూసైడ్‌ అటెంప్ట్‌, ఫేస్‌బుక్‌లో వీడియో
 సోనమ్‌.. నీ ఫ్రెండ్స్‌ ఎంతమందితో అతడు బెడ్‌ షేర్‌ చేసుకున్నాడు?

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)