Breaking News

సీతగా 'సాయిపల్లవి'నే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌

Published on Fri, 07/18/2025 - 08:10

భారత సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్సినిమా 'రామాయణ'.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న చిత్రం కోసం ఏకంగా రూ. 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మేకర్స్ప్రకటించారు. మూవీకి నితేశ్‌ తివారీ దర్శకుడు. ఇందులో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్‌ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాయి. తాజాగా మూవీ టీమ్మాట్లాడుతూ సీతగా సాయిపల్లవిని ఎందుకు ఎంపిక చేశారో పేర్కొంది.

సీతా దేవి పాత్ర కోసం చాలామందిని అనుకున్నాం. కానీ, సాయిపల్లవిని ఫైనల్చేయడానికి తమకు చాలా కారణాలు ఉన్నాయిని రామాయణ చిత్ర యూనిట్పేర్కొంది. ఆమె గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉండటమే కాకుండా తన అందం కోసం ఆమె ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని తెలిపింది. సహజ అందమే తమ సినిమాకు బాగుంటుందని అనుకున్నామని, అలా ఒక సందేశం ఇచ్చినట్లు ఉంటుందని టీమ్‌ రామాయణ ప్రకటించింది. సాయి పల్లవి మంచి నటి కూడా.. ఎలాంటి పాత్రనైనా సులువుగా చేయగలదు. సీత పాత్ర తనకు ఎంతో పేరు తప్పకుండా తెస్తుందని వారు తెలిపారు

రాముడిగా రణ్‌బీర్‌ను తీసుకోవడానికి కారణం ఆయన మొఖంలో చాలా ప్రశాంతత కనిపిస్తుందని చెప్పారు. తనలోని వ్యక్తిత్వమే కాకుండా గొప్పగా నటించే నైపుణ్యం తనలో ఉందని మేకర్స్చెప్పారు. ఈ మూవీ మొదటి పార్ట్‌ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానున్న విషయం తెలిసిందే.  హాలీవుడ్హిట్సినిమా'లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌'కు పనిచేసిన స్టంట్‌ డైరెక్టర్‌ టెర్రీ ‘రామాయణ’ ప్రాజెక్ట్లో భాగమయ్యారని మేకర్స్ప్రకటించారు. వానరసేన, హనుమాన్‌లతో కనిపించే సన్నివేశాలకు సంబంధించి ఆయన క్రియేట్చేసిన ప్రపంచానికి అందరూ ఫిదా అవుతారని తెలిపారు. 'ప్లానెట్‌ ఆఫ్ ది ఏప్స్‌'లో ఏ విధంగానైతే వీఎఫ్‌ఎక్స్‌ పనితీరు ఉంటుందో అదే విధంగా రామాయణ చిత్రంలోని వానరసేన అంతే సహజంగా ఉంటుందని టీమ్తెలిపింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు