Breaking News

ఖరీదైన సినిమా.. సూపర్‌ స్టార్‌-ఐకాన్‌ స్టార్‌ వార్‌!

Published on Tue, 04/15/2025 - 15:09

ఈ ఏడాది అత్యంత ఖరీదైన చిత్రాల రూపకల్పనలో భారతీయ చిత్ర పరిశ్రమ కొత్త శిఖరాలను అధిరోహించనుంది. ఈ నేపధ్యంలోనే ఆల్‌ ఇండియా స్టార్‌ అల్లు అర్జున్‌ సెన్సేషనల్‌ దర్శకుడు అట్లీ కలయికలో తమ కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడంతో ఇద్దరు టాలీవుడ్‌ అగ్రగామి నటుల మధ్య సరికొత్త వార్‌ మొదలైందనొచ్చు. 

దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమా నాదే అనే కిరీటాన్ని అందుకోవడానికి ఈ ఇద్దరు స్టార్స్‌ పోటీపడుతున్నారు. వీరిద్దరూ మాత్రమే కాదు నేను కూడా ఉన్నానంటూ బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ కూడా అదే వరుసలో నిలవడంతో.. పోటీ రసకందాయకంగా మారింది.

రూ.2 వేల కోట్ల కలెక్షన్స్‌ నిన్న.. రూ1,000 కోట్ల పెట్టుబడి నేడు.. అన్నట్టుగా ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ చిత్రం రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మహేష్‌బాబుతో ఆయన తీస్తున్న చిత్రం ఎస్‌ఎస్‌ఎస్‌బి29 బడ్జెట్‌ రూ.1000 కోట్ల వరకూ ఉండొచ్చునంటున్నారు. 

మరోవైపు బాలీవుడ్‌ అగ్ర కధానాయకుల్లో ఒకరైన రణబీర్‌ కపూర్‌తో  రామాయణం తెరకెక్కుతోంది. ఈ చిత్రం బడ్జెట్‌ కూడా రూ.900 కోట్లకు దగ్గరగా ఉండొచ్చునని చెబతున్నారు. ఈ రెండు సినిమాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనతో ఉన్నప్పటికీ...   భారతీయ చలనచిత్ర పరిశ్రమలో  తమ తమ చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్‌లు సాధించిన అల్లు అర్జున్, అట్లీలు  సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌  భారీ బడ్జెట్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నట్టు వచ్చిన ప్రకటన పలు ఆశ్చర్యకరమైన అంకెల్ని సినీ అభిమానుల కళ్ల ముందుకు తెచ్చింది. 

ప్రస్తుతం ఏఏ22xఏ6 అని పేర్కొంటున్న ఈ చిత్రం అత్యంత ఖరీదైన భారతీయ చలనచిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమా బడ్జెట్‌ రూ. 800 కోట్లు కాగా ఇందులో నిర్మాణ వ్యయంగా రూ. 200 కోట్లు, విఎఫ్‌ఎక్స్‌ (స్పెషల్‌ ఎఫెక్ట్స్‌) కోసం రూ.250 కోట్లు, అల్లు అర్జున్‌ రెమ్యునరేషన్‌ రూ. 175 కోట్లు, దర్శకుడు అట్లీ రెమ్యునరేషన్‌ రూ. 100 కోట్లుగా లెక్కిస్తున్నారు.

ఇదే కాకుండా అల్లు అర్జున్‌కూ సినిమా లాభంలో 15 శాతం ఉంటుందని, అలాగే అట్లీకి కూడా బ్యాకెండ్‌ డీల్‌ ఉంటుందని సమాచారం. అవతార్, ఐరన్‌ మ్యాన్‌ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన నిపుణులు ఇందులో భాగం పంచుకుంటున్న నేపధ్యంలో ఈ సినిమా ఇండియన్‌ స్క్రీన్‌పై విజువల్‌ ట్రీట్‌గా ఉంటుందని భావిస్తున్నారు.  

ఈ చిత్రం అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ఒక ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లవచ్చునని.. అట్లీ తరచుగా ఆలోచించినట్టే ఆలోచిస్తే అల్లు అర్జున్‌ ద్విపాత్రాభినయం కూడా ఉండొచ్చు అంటున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఆగస్ట్‌ లో ప్రారంభం కానుంది.

ప్రస్తుత బడ్జెట్‌ల ప్రకారం రాజమౌళి, మహేష్‌ బాబుల సినిమాయే అత్యంత ఖరీదైన చిత్రం కావడం ఖాయంగా తెలుస్తున్నప్పటికీ..మరెన్నో నెలల పాటు.షూటింగ్‌ సాగే క్రమంలో బడ్జెట్‌లో కూడికలు, తీసివేతలు.. మార్పు చేర్పులు అంతిమంగా ఈ విషయాన్ని ఖరారు చేస్తాయని అనుకోవచ్చు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)