Breaking News

'ఒడిస్సీ'లో చూపించినవి నిజమైన లొకేషన్లే.. ఏది ఎక్కడంటే?

Published on Mon, 07/20/2026 - 12:36

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయిపోయిన సినిమా 'ది ఒడిస్సీ'. హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఈ మూవీ గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. వీకెండ్ పూర్తయ్యేసరికి ఏకంగా రూ.2500 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుని సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అయితే మూవీ చూసిన చాలామంది.. దీనిని నిజమైన లొకేషన్లలో తీశారా? లేదంటే గ్రీన్/బ్లూ స్క్రీన్ ఉపయోగించారా అని అనుకుంటున్నారు. కానీ మీరు మూవీలో చూసిన లొకేషన్లన్నీ నిజమైనవే.

(ఇదీ చదవండి: క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ'.. ఎందుకు చూడాలి?)

నోలన్.. మూడు వేల ఏళ్ల క్రితం హోమర్ రాసిన గ్రీకు మైథాలజీ 'ఒడిస్సీ' అనే పుస్తకం ఆధారంగా సినిమా తీశాడు. అయితే గ్రీన్ స్క్రీన్, గ్రాఫిక్స్ ఉపయోగిస్తే అంత ప్రభావవంతంగా ఉండదనుకున్నాడో ఏమో గానీ గ్రీస్, ఇటలీ, స్కాట్లాండ్, ఐస్ లాండ్ లాంటి దేశాల్లో చిత్రీకరణ జరిపాడు.

సినిమాలో ట్రాయ్ యుద్ధం జరిగే లొకేషన్ మొరాకోలో ఉంది. అందులో గుర్రం, చిన్నపాటి భవంతులని సెట్స్ వేసి మిగిలినవి మాత్రం నిజమైన చోటు అయిన ఎట్ బెన్ హద్దు అనే ప్రదేశంలో చిత్రీకరించారు. అలానే ఒంటికన్ను రాక్షసుడు కనిపించే గుహ సీన్స్.. గ్రీస్‌లోని నెస్టర్ గుహలో తెరకెక్కించారు. ఇక ఒడిసియస్ రాజు ప్యాలెస్ సీన్లన్నీ ఇటలీలోని కాస్టలీ డీ శాంటా కేటరినా అనే కొండపై షూటింగ్ చేశారు.

ఇక పెద్ద పెద్ద మనుషులు కనిపించే సన్నివేశాన్ని స్కాట్లాండ్‌లోని సముద్రపు ఒడ్డున ఉన్న కల్బిన్ అడవిలో చిత్రీకరించారు. ఒడిసియస్ ప్రయాణిస్తున్న పడవ ఓ చోట సుడిగుండంలో చిక్కుకునేలా కనిపిస్తుంది. ఈ సీన్‌ని ఇటలీలోని ఫరగ్‌లియోనీ ది లిపారీ అనే చోట తీశారు. మూవీకి సంబంధించిన 23 నిమిషాల మేకింగ్ వీడియోని ఇప్పటికే హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. అది చూస్తే షూటింగ్ కోసం నోలన్ అంట్ టీమ్ ఎంతలా కష్టపడ్డారు? ఏయే లొకేషన్లలో సీన్స్ తీశారో చూడొచ్చు.

(ఇదీ చదవండి: ‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

Videos

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)