Breaking News

హాలీవుడ్ స్టార్ ముందు భారత గౌరవాన్ని నిలబెట్టిన శివాజీ గణేశన్!

Published on Thu, 07/30/2026 - 21:51

దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ నటించిన అనేక చిత్రాలు.. స్వాతంత్య్రం అనంతర భారత నేపథ్యంతో తెరకెక్కాయి. మారుతున్న సమాజం ఎదుర్కొన్న పోరాటాలను ఆ చిత్రాలు చూపించాయి. రాజ్ కపూర్ నటించిన ఆవారా (1951) మాదిరిగానే, శివాజీ తొలి చిత్రం పరాశక్తి (1952) కూడా ఆర్థిక ఇబ్బందులు, భారతదేశంలోని పెద్ద నగరాలకు వలస వచ్చిన కార్మిక వర్గం ఎదుర్కొన్న కష్టాలను చిత్రీకరించింది. సత్యజిత్ రే తీసిన కొన్ని చిత్రాలు, ముఖ్యంగా ది అపు ట్రిలజీ, కూడా ఇలాంటి అంశాలను కలిగి ఉన్నాయి.

ఆసక్తికర విషయం ఏమిటంటే, 1960లలో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, అమెరికన్ ఎంబసీ సంయుక్తంగా నిర్వహించిన పర్యటనలో భాగంగా శివాజీ గణేశన్ హాలీవుడ్‌ను సందర్శించినప్పుడు, ఆయన మార్లన్ బ్రాండోతో చేసిన సంభాషణలో ప్రధాన అంశం భారత్‌లో పేదరికమే. ఈ విషయాన్ని శివాజీ కుమారుడు రామ్‌కుమార్ గణేశన్ ఇటీవల ట్రూలీ రామ్‌తో జరిగిన చర్చలో వెల్లడించారు.

రామ్‌కుమార్ మాట్లాడుతూ.. సత్యజిత్ రే తీసిన కొన్ని చిత్రాలు చూసిన తర్వాత భారత్‌లో కనిపించిన పేదరిక స్థాయిపై బ్రాండో మాట్లాడారని చెప్పారు. దీనికి ప్రతిగా, రే తన దేశంలోని పేదరికంపై అవగాహన పెంచేందుకు ఆ చిత్రాలు తీశారని, పశ్చిమ దేశాలకు వాటిని మార్కెట్ చేయాలనే ఉద్దేశం కాదని శివాజీ వివరించారని చెప్పారు. అంతేకాదు, తాను ధరించిన సూట్‌ను చూపిస్తూ భారత్‌లో అందరూ పేదలు కాదని ఆయన స్పష్టం చేశారని తెలిపారు.

"మా నాన్న ఆయనతో ఇలా చెప్పారు. 'మిస్టర్ బ్రాండో, నేను ధరించిన సూట్ చూశారా? ఇది $500 విలువైన సూట్. భారత్‌లో అందరూ పేదలు కాదు. ఇలాంటి సూట్లు కొనగలిగే వారు కూడా ఉన్నారు. పేదలు ఉన్నట్టే అలాంటి వారు కూడా ఉన్నారు'" అని అన్నారు.

ఆసక్తికరంగా, శివాజీ గణేశన్, సత్యజిత్ రే ఒక చలనచిత్రోత్సవంలో కలుసుకున్న విషయం తనకు 20 ఏళ్ల క్రితం వరకూ తెలియదని కూడా రామ్‌కుమార్ చెప్పారు. అలాగే, పేదరికంపై శివాజీ గణేశన్ అభిప్రాయం బ్రాండో ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చని ఆయన సూచించారు. దాని ఫలితంగానే 1973లో ది గాడ్‌ఫాదర్ చిత్రానికి వచ్చిన ఉత్తమ నటుడు ఆస్కార్‌ను తన తరఫున తిరస్కరించేలా స్థానిక అమెరికన్ ఉద్యమకారిణి సచీన్ లిటిల్‌ఫెదర్‌ను అకాడమీ అవార్డుల వేదికపైకి పంపి నిరసన తెలిపి ఉండొచ్చని అన్నారు.

Videos

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

ముదునూరి మురళీ కృష్ణంరాజుకు వైఎస్ జగన్ పరామర్శ

గణేష్ నిమజ్జనంలో సజ్జనార్ డ్యాన్స్ వైరల్

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)