Breaking News

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రానున్న సినిమాలివే..!

Published on Mon, 01/30/2023 - 17:56

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయగా.. ఆ తర్వాత చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఫిబ్రవరి మొదటి వారంలోనే పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ వారం సినీ ప్రేక్షకులకు కనువిందు చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. థియేటర్లతో పాటు ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైన సినిమాలేవో ఓసారి చూసేద్దాం.

సందీప్‌ కిషన్‌- మైఖేల్

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం మైఖేల్‌. రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్‌గా నటించింది. విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సుహాస్‌- రైటర్‌ పద్మభూషణ్‌

కలర్‌ ఫోటో ఫేమ్‌ సుహాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రైటర్‌ పద్మభూషణ్‌. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టీనా శిల్పరాజ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్లు, టీజర్‌ ఇప్పటికే పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

జయప్రద- సువర్ణ సుందరి

సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు.  డాక్టర్ ఎమ్‌వీకే రెడ్డి సమర్పణలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో విడుదల కానుంది. 

ప్రేమదేశం

త్రిగుణ్, మేఘా ఆకాష్‌ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమదేశం’. శ్రీకాంత్‌ సిద్ధమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. శిరీష సిద్ధమ్‌ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్‌ కానుంది. 

బుట్టబొమ్మ

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న అనిఖా సురేంద్రన్‌ తెలుగులో హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో  అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో సందడి చేయనుంది. 


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  •  పమీలా (హాలీవుడ్) జనవరి 31
  • గంతర్స్‌ మిలియన్స్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 1
  • క్లాస్‌ (వెబ్‌సిరీస్‌- సీజన్‌-1) ఫిబ్రవరి 3
  •  ట్రూ స్పిరిట్‌ ఫిబ్రవరి 3
  •  ఇన్‌ఫయీస్టో (హాలీవుడ్‌) ఫిబ్రవరి 3
  • స్ట్రామ్‌ బాయిల్‌ ఫిబ్రవరి 3
  •  వైకింగ్‌ ఊల్ఫ్‌ ఫిబ్రవరి 3

డిస్నీ+హాట్‌స్టార్‌

  • బ్లాక్‌ పాంథర్‌ వాఖండా ఫరెవర్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 1
  • సెంబి (తమిళ్‌) ఫిబ్రవరి 3

ఆహా

  • అన్‌స్టాపబుల్ సీజన్-2 విత్ ఎన్‌బీకే- ఫిబ్రవరి 3
  • ముఖచిత్రం(తెలుగు)- ఫిబ్రవరి 3
  • కపుల్ ఆన్ బ్యాక్‌ట్రాక్( కొరియన్ మూవీ ఇన్ తెలుగు)- ఫిబ్రవరి 4
  • కామెడీ స్టాక్ ఎ‍క్సేంజ్- ఫినాలే ఎపిసోడ్- ఫిబ్రవరి 4

సోనీలివ్

  • జహనాబాద్‌ ఆఫ్ లవ్‌ అండ్‌ వార్‌ (హిందీ) ఫిబ్రవరి 3

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)