Breaking News

'వార్‌ 2' నష్టం.. షారుఖ్ ఖాన్ సాయం..!

Published on Sat, 10/25/2025 - 14:02

ఎన్టీఆర్‌, హృతిక్‌రోషన్‌ కలిసి నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘వార్‌ 2’(WAR 2).  భారీ అంచనాలతో విడుదలైన  ఈ మూవీ అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేదు. దీంతో యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చే తదుపరి చిత్రం 'ఆల్పా'పై ఎక్కవ ప్రభావం చూపనుంది. ఈ స్పై యూనివర్స్‌ నుంచి ఇప్పటికే వచ్చిన పఠాన్‌, వార్‌-1 చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. అయితే, వార్ 2తో ఈ ఫ్రాంచైజీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. దీంతో స్పై యూనివర్స్‌ నుంచి రానున్న చిత్రాలపై మిశ్రమ స్పందన వచ్చే ఛాన్స్‌ ఉంది. ఈ ఫ్రాంచైజీని  కాపాడుకునేందుకు షారుఖ్‌ ఖాన్‌(Shah Rukh Khan)ను నిర్మాత ఆదిత్య చోప్రా సంప్రదించారని తెలుస్తోంది.  

యశ్‌రాజ్ ఫిల్మ్స్; స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో విడుదల కానున్న చిత్రం 'ఆల్ఫా'.., ఇందులో అలియా భట్( Alia Bhatt), శార్వరి వాఘ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఇందులో బాబీ డియోల్, అనిల్ కపూర్ కూడా నటించారు. వార్ 2 పరాజయం కారణంగా, YRF అధినేత ఆదిత్య చోప్రా తమ ఫ్రాంచైజీ ఉణికిని కాపాడుకునేందుకు షారుఖ్ ఖాన్‌ సాయం కోరారని తెలుస్తోంది. 'ఆల్ఫా' చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో నటించాలని నిర్మాత ఆదిత్య చోప్రా కోరినట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆల్ఫా దర్శకుడు శివ్‌ రావేల్‌ కూడా షారుఖ్‌ కోసం సరైన పాత్రను ప్లాన్‌ చేశారని టాక్‌.

యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో షారుఖ్‌ ఖాన్‌ నటించిన  పఠాన్ అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ సినిమాలోని షారుఖ్‌ పాత్రకు బాలీవుడ్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల, ఆల్ఫాలో అతిధి పాత్రలో షారుఖ్‌ నటిస్తే సినిమాకు లాభం చేకూరుతుందని ఆదిత్య చోప్రా అభ్యర్థించినట్లు చెబుతున్నారు. కానీ, షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం కింగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే, ఆదిత్య కోరికమేరకు షారుఖ్ ఖాన్ తన  షెడ్యూల్స్‌ను మార్చుకోనున్నారట. 'ఆల్పా'లో ఆయన అతిధి పాత్రలో కనిపించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని సమాచారం. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ స్పై యూనివర్స్‌లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంగా 'ఆల్ఫా' రానుంది. మునుపెన్నడూ చూడని భారీ యాక్షన్‌ సన్నివేశాలను ఇందులో చూడొచ్చని గతంలో ఈ చిత్ర దర్శకుడు శివ్‌ రావేల్‌ చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)