Breaking News

'వ్యూహం' నుంచి దమ్మున్న సాంగ్‌తో ఊపేసిన రాహుల్‌ సిప్లిగంజ్‌

Published on Mon, 10/16/2023 - 10:59

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌,ట్రైలర్‌ తెలుగు రాష్ట్రాల్లో  సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వ్యూహం సినిమా నుంచి YSRCP అనే సాంగ్‌ను వర్మ విడుదల చేశారు. ఈ పాట కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో నాటు.. నాటు పాటకు ఆస్కార్‌ అవార్డుతో మరింత గుర్తింపు పొందిన రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు.

(ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి)

వైఎస్సార్‌సీపీ.. వైఎస్సార్‌సీపీ (YSRCP).. ఢీ కొట్టే మా పార్టీ వచ్చింది చూడు.. దమ్మున్న మా పార్టీ వచ్చింది చూడు.. ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు.. సీమ సింగంలా తొడగొట్టే  చూడు.. అంటూ సాగే పాటను రాహుల్‌ అద్భుతంగా పాడారు. ఇప్పటికే వ్యూహం నుంచి   వెన్ను పోటు సాంగ్ పేరుతో.. పులుల రూపంలో గుంట నక్కలు అంటూ ఒక పాటను వర్మ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట యూట్యూబ్‌లో సంచలనం క్రియేట్ చేస్తుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ.

రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా.. మొదటి భాగం వ్యూహం పేరుతో నవంబర్‌ 10న విడుదల కానుంది. శపథం పేరుతో రెండో భాగం జనవరి 25న విడుదల కానున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యూహం మూవీలో వైఎస్‌ జగన్ గారి పాత్రతో దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ నటిస్తుండగా.. వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్   నటిస్తున్నారు. ‘అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం’ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్‌ పతాకంపై దాసరి కిరణ్‌ నిర్మిస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)