Breaking News

'వ్యూహం' ట్రైలర్‌: కల్యాణ్‌కు తెలివి లేదు.. ఎన్నికల తర్వాత గ్లాస్‌ పగిలిపోతుంది

Published on Fri, 10/13/2023 - 13:34

ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌ సంచలనం సృష్టించింది. తాజాగా వ్యూహం సినిమా నుంచి ట్రైలర్‌ను ఆర్జీవీ విడుదల చేశారు. ఇందులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను తనదైన స్టైల్లో చూపించారు. 

సోనియా గాంధీ పాత్రధారి ఫోన్‌ కాల్‌తో వ్యూహం ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది.  జగన్ పాత్ర పోషించిన అజ్మల్ అమీర్‌ను ఓదార్పు యాత్ర ఆపేయాలని వార్నింగ్‌ ఇస్తుంది. అప్పుడు చంద్రబాబు పాత్ర పోషించిన వ్యక్తి  తెరపైకి వస్తాడు. ఇప్పుడు మన వ్యూహం మొదలవుతుంది అని కన్నింగ్‌ డైలాగ్‌ చెప్పడం. ఆ కల్యాణ్‌కు ఎవరు శత్రువో.. ఎవరు మిత్రుడో గుర్తించే తెలివి లేదయ్యా అంటూ బాబు పాత్రధారి చెప్పే డైలాగ్‌తో పాటు పలు ఆసక్తికరమైన వాస్తవ సన్నివేశాలను వర్మ తెరికెక్కించినట్లు తెలుస్తోంది.

వైఎస్‌ జగన్ గారి బాడీ లాంగ్వేజ్‌ అజ్మల్ అద్బుతంగా అనుసరించారని చెప్పవచ్చు. అలాగే వైఎస్‌ భారతిగా మానస కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. బాలాజీ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ నవంబర్ 10న సినిమా విడుదలకానుంది. రెండోవ భాగం శపథం 2024 జనవరి 25న విడుదల అవుతుందని వర్మ ప్రకటించారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)